Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి హాట్ బ్యూటీ .. ఇదేం ట్విస్ట్ మామా.. ఇక రచ్చే..

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొదటి వారం బెజవాడ బేబక్క హౌస్ నుంచి వెళ్ళిపోయింది. రెండో వారం శేఖర్ భాషా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రెండు వారాలు పూర్తి అయింది. ప్రస్తుతం ఎవరి నోట విన్నా కూడా బిగ్ బాస్ పేరే వినిపిస్తుంది. గతంలో ఎన్నాడూ చూడని విధంగా సరికొత్త కాన్సెప్టులు, టాస్కులతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ముందుగా అన్నట్టుగానే బీబీ లవర్స్ కు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది. ఈ షో మొదలై అప్పుడే రెండు వారాలు పూర్తి అయ్యింది. ఇక వైల్డ్ కార్డు ద్వారా ఎవరు వస్తారా అని ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైల్డ్ కార్డు ద్వారా ఓ హాట్ అండ్ ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ ను హౌస్ లోకి పంపునున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదు గత సీజన్ లో దుమ్ము దులిపేసిన గీతూ రాయల్ ( Geethu Royal ) .. మొదటగా జ్యోతి రాయ్( Jyothi Rai ) పేరు వినిపించింది. కానీ ఆమె బిజీగా ఉండటం వల్ల రాలేక పోయింది. ఇప్పుడు ఆ ప్లేసులోకి చిత్తూరు బిడ్డ గీతూ రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. సీమ యాసలో మాట్లాడుతూ ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ 6వ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులకు పుల్ ఎంటర్టైన్ మెంట్ అందించి.. పాజిటీవ్ ఓపినియన్ తెచ్చుకుంది..

Hot beauty enters the Bigg Boss house.
Hot beauty enters the Bigg Boss house.

గీతూ రాయల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘బిగ్‌బాస్‌పై నా ప్రేమ శాశ్వతమైనది’.. అంటూ రాసుకొచ్చింది. అలాగే పలు ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతుంది. ఇలా అమ్మడు హౌస్‌లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తే రచ్చ రచ్చే అంటూ కామెంట్స్ చేస్తున్నారు బీబీ లవర్స్. అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే క్రమంలో బిగ్ బాస్ టీం పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే ఈ ఫోటోలను చూసి ఫ్యాన్స్ పిక్స్ అయ్యారు. ఈమె వస్తే ఇక హౌస్ మొత్తం రచ్చ రచ్చే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈమెతో పాటుగా ముక్కు అవినాశ్, శోభా శెట్టి, రోహిణీ, హరితేజ, నయని పావని లను వైల్డ్ కార్డ్ తో హౌస్‌లోకి తీసుకరాబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈసారి రచ్చ .. ఇక ఈ వారం నామినేషన్స్ కొత్తగా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది .

 

View this post on Instagram

 

A post shared by Geetu Royal (@geeturoyal_)

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు