Bigg Boss 8 Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. రెండో వారం నామినేషన్స్ ముగిసాయి. ఇక టాస్క్ ల తంతు మొదలైంది. నిన్న నామినేషన్స్ చివరి రోజు.. ఈరోజు ఉదయం నుంచే బిగ్ బాస్ హౌస్ మెట్స్ కు గొడవలు పెట్టేశాడు. హౌస్ లో కొనసాగాలి అంటే ఎవరి ఫుడ్ వాళ్లే సంపాదించుకోవాలని కండిషన్ పెట్టాడు. అందులో భాగంగా బిగ్ బాస్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. రేషన్ కావాలంటే టాస్క్ లో పాల్గొనాలని చెప్పడంతో ప్రతి ఒక్కరు పరుగులు పెడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆట రంజుగా మారింది.. అయితే తాజాగా విడుదలైన ప్రోమో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.
ఆకలితో మాడకూడదు అని హౌస్‌లోని వాళ్లను మూడు గ్రూపులు చేశారు. వారంతా తిండి కోసం ముష్టి యుద్ధం మొదలు పెట్టారు. తిండి కోసం కూడా కొట్లాటలు పెట్టేశాడు. ఎవరికి ఏం కావాలి అన్న దానిని ఆడి గెలుచుకోవాల్సిందే అని చెప్పాడు. ఆ మూడు గ్రూపులు తమ వాళ్లకు ఫుడ్ ను సంపాదించాలని కొట్టుకున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రోమోను చూస్తే.. ఈ ఆటల్లో సంచాలక్ గా ఉన్న చీఫ్ యష్మీ గౌడ ( Yashmi Gowda ) కు నాగ మణికంఠ ( Manikanta ) మధ్య చిన్న వివాదం జరిగింది. ఆ గొడవలో సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అంటూ యష్మీ ఒక పెద్ద డైలాగ్ కూడా చెప్పింది.
ఇక టాస్క్ లు ఆడి కొంతవరకు ఫుడ్ ను సంపాదించుకున్నారు. అయితే సంపాదించుకున్న రేషన్ ను వేరే గ్రూప్ వాళ్లు దొంగతనం చేస్తున్నారు. ముందుగా నైనిక దొంగిలించింది. ఆ తర్వాత నబీల్ ( Nabeel ) వచ్చి నిఖిల్ దగ్గర అంటాడు. మా చికెన్ ను ఎవరో దొంగిలించారు అని, ఇక నిఖిల్ కూడా నువ్వూ దొంగిలించు అని చెప్పగా అతను కూడా వెళ్లి దొంగతనం చేస్తాడు. ఇలాంటి ఒకరిది మరొకరు దొబ్బెస్తున్నారు. ఇక చివరగా నైనికా ఒక సెల్ఫ్ దగ్గర కూర్చుంటుంది. అక్కడకు మణికంఠ వస్తాడు. నాకు ఫుడ్ ఏదైన పెట్టు రెండు రోజుల నుంచి తినలేదు అని చెబుతాడు. దానికి నిఖిల్ (Nikhil ) నన్ను తింటున్నావ్ కదారా, నీ వల్ల ఐదు కేజీలు తగ్గాను అని చెప్తాడు. అప్పుడు మణికంఠ నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఎవరైనా పల్ఫీ మోహనా కొట్టండి అని చెబుతాడు.. దాంతో వీడియో ఎండ్ అవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి.. ఇక ఈ వారం హౌస్ మేట్స్ ఎక్కువగా నిఖిల్ ను నామినేట్ చేసారు. అతను గత వారం చీఫ్ సరిగ్గా చెయ్యలేదని అందరు అతన్నే నామినేట్ చేసారు. అయితే ఈవారం హౌస్ నుంచి పృద్వి బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆదిత్య ఓం కూడా వీక్ ఆటల్లో సరిగ్గా పెర్ఫామ్ చెయ్యలేదు . ఈయన వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి . మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..