Bigg Boss 8 Telugu : తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 8 సీజన్ ఆట మొదలైంది.. ఫస్ట్ వీక్ చప్పగా సాగిన ఎలిమినేషన్ రెండో వారం హాట్ హాట్ గా మారింది. మొదటి వారం బెజవాడ బేబక్క ( Bejawada Bebakka ) హౌస్ లో అతి తక్కువ ఓట్లను అందుకొని అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. అంతేకాదు బయట వెళ్తు హౌస్ మెట్స్ ముసుగులో ఉన్నారని చెప్పి బాంబ్ పేల్చింది. ఇకపోతే ఈమె బ్యాగ్రౌండ్ గురించి అతి తక్కువ మందికే తెలుసు. అయితే ఆమె గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్ లోకి రావడానికి పెద్ద త్యాగం చేసిందని తెలుస్తుంది. అది విన్న ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అదేంటో ఒకసారి చూసేద్దాం..
బెజవాడ బేబక్క బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన మొదటి వారంకే బయటకు వచ్చేసింది. హౌస్ లో తన ఆట, మాటలతో ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు.. దాంతో ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరిలాగే ఇంటర్వ్యూలు ఇచ్చింది. సంచలన నిజాలను బయట పెట్టింది. వరుస ఇంటర్వ్యూలతో తన జీవితం గురించి చాలా విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. బెజవాడ బేబక్కగా అందరికీ సుపరిచతమైన బేబక్క అసలు పేరు మధు ( Madhu ). ఈమె ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ కామెడీ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యింది. బేబక్క మంచి సింగర్ కూడా. ఆమె చేసే రీల్స్ ఫన్నీగా ఉన్నా కూడా ఆమె బ్యాగ్రౌండ్ పెద్దగానే ఉంది. పెద్ద స్టార్స్ ఫ్యామిలీ నుంచే వచ్చింది. ఆమె అన్న ఒక నటుడు. పెద్దనాన్న డైరెక్టర్..
ఇదిలా ఉండగా తాజాగా ఈమె గురించి మరో గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఎంబీఏలో యూనివర్సిటీ టాపర్ కూడా. కాలేజీల్లో లెక్చురర్‌గా పని చేసేందుకు బేబక్కకు చాలా ఆఫర్స్ కూడా వచ్చాయట. కానీ అమెరికా లో మంచి ఉద్యోగం రావడంతో అమెరికా వెళ్లిపోయిందట బేబక్క. అక్కడే దాదాపు పదేళ్లు ఉద్యోగం చేసిందట. టెస్ట్ లీడ్‌గా బేబక్క ఉద్యోగం చేస్తున్న సమయంలో వాళ్ల టీంలో అందరికంటే ఆమే చిన్నదట. అయినప్పటికీ ఆమెకు ఉన్న టాలెంట్ తో అందరికంటే ఎక్కువ ప్యాకేజీ సొంతం చేసుకుందట.. ఇలాంటి స్క్రీన్ మీద కనిపించడం చాలా ఇష్టమట.. సింగర్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటం. ఆ కారణంగానే కొన్నేళ్ల క్రితం జాబ్ వదిలేసి మరీ ఇండియాకు వచ్చేసింది. సినీ ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతోనే బిగ్ బాస్‌లో అవకాశం రాగానే వెళ్లిపోయానంటోంది బేబక్క. కానీ వారం రోజుల్లోనే తాను ఎలిమినేట్ అయ్యి వచ్చేస్తానని అనుకోలేదని చెప్పింది. ఏది ఏమైనా కోటి రూపాయల ఫ్యాకేజి ను వదిలేసుకొని ఇలా చెయ్యడం పై కొందరు మండిపడుతున్నారు.