Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో రెండో వారం నామినేషన్స్ హీటేక్కించాయి.. నచ్చని వారికి రంగు పడుద్ది అంటూ ఒక్కొక్కరు నామీనెట్ చేశారు. మూడోరోజు నుంచి టాస్క్ లతో హౌస్ మెట్స్ ను పరిగెత్తించారు. ఈ టాస్క్ ఫిజికల్ గానే అన్నట్లు కొత్తగా ఉంది. కడుపు నిండాలంటే కలబడాలి అన్నట్లు విచిత్రంగా బిగ్ బాస్ హౌస్ లో రేషన్ కావాలంటే టాస్క్ లో అందరు పాలు పంచుకోవాల్సిందే.. మంగళవారం ఎపిసోడ్ హైలెట్స్ ను ఒకసారి చూసేద్దాం..
హౌస్ లో రేషన్ కోసం పోటీలు పడ్డారు. ఈ పోటీల్లో రెండు క్లాన్లకు సరుకులు లభించగా..ఒక క్లాన్ కు ఫుడ్ దొరకలేదు.. ఇక ఆడటం మానేసి దొంగలుగా మారరు. ఫుడ్ ను దొంగలించారు. క్లాన్లు రేషన్ సాధించే ప్రక్రియను బిగ్‌బాస్ వివరించారు. యాక్షన్ ఏరియాలో సూపర్ మార్కెట్లో ముందుగా ముగ్గురు చీఫ్‌లు షాపింగ్ చేయాలని అన్నారు. ఇతర చీఫ్‌లతో, క్లాన్లతో వాటిని పంచుకోకూడదని అన్నారు. ఏ క్లాన్ వారు వండుకున్న ఆహారాన్ని ఆ క్లానే తినాలని చెప్పారు. దీంతో చీఫ్ యష్మి, నైనిక, నిఖిల్ కావాల్సిన ఆహార పదార్థాలను బాస్కెట్లో వేసుకొని తెచ్చుకున్నారు..
ఆ రేషన్ దక్కాలంటే టాస్క్ లు ఖచ్చితంగా ఆడాలని బిగ్ బాస్ చెబుతాడు. అయితే మొదటి టాస్క్ గా లెమన్ పిజ్జా గేమ్‌ను కంటెస్టెంట్లకు పెట్టారు. నిమ్మకాలను మేజ్ లోపల నుంచి బయటికి తీసి ఎక్కువ రౌండ్లు గెలుస్తారో ఆ క్లాన్ రేషన్ దక్కించుకుంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ఇకపోతే మూడు క్లాన్ల తరఫున ఇద్దరిద్దరు కంటెస్టెంట్లు లెమన్ పిజ్జా గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో యష్మి క్లాన్ విజయం సాధించింది. ఆ మూడు క్లాన్ రేషన్ దక్కించుకుంది. రేషన్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని బిగ్‌బాస్ జాగ్రత్తలు చెప్పారు. ఇక ఏముంది దొంగలు పడి రేషన్ ను చోరీ చేసి షాక్ ఇచ్చారు.
రెండో టాస్క్ గా ఇచ్చారు. కనిపెట్టు.. పరిగెత్తు అని ఇచ్చారు బిగ్ బాస్.. ఇందులో భాగంగా మరమరాలను తీసుకొచ్చిన విషయంలో మణికంఠ, ఈ టాస్క్ సంచాలక్ యష్మి మధ్య వాగ్వాదం జరిగింది.. ఆ తర్వాత హౌస్‌లో ఫుడ్ దొంగతనమైందని నబీల్ అఫ్రిది అరిచారు. తమ క్లాన్ చికెన్‌ను ఎవరో కొట్టేశారని గగ్గోలు పెట్టారు. తాను అనుకుంటే అందరి కంటే ఎక్కువ దొంగతనం చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో యష్మి క్లాన్ నుంచి కొన్నింటినీ దోచేశారు నబీల్.. ఇక మిగిలిన వాళ్లు మాట్లాడుతూ.. హౌస్‌లో ఎదుటి వారిని రెచ్చగొట్టాలంటే విష్ణుప్రియ, నైనికనే అని అభయ్‌తో సోనియా అన్నారు. ప్రేరణ మెచ్యూర్డ్‌గా రెచ్చగొడుతుందని అభయ్ అన్నాడు.. మొత్తానికి ఎపిసోడ్ ఫుడ్ కోసం గొడవలతో ముగుస్తుంది. మరి ఈరోజు ఎలాంటి టాస్క్ లను బిగ్ బాస్ ఇస్తాడో చూడాలి..