Bigg Boss 8 Telugu : స్టార్ మాలో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ( Bigg Boss) తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకొని ఎనిమిదోవ సీజన్ ప్రారంభం అయ్యింది. గత సీజనలతో పోలిస్తే ఇది కాస్త తేలిపోయిందని తెలుస్తుంది. మొదటి రెండు రోజులు కాస్త చిరాకు తెప్పించిన ఈ షో నిన్న రాత్రి మాత్రం ఆకట్టుకుంది. నామినేషన్ ప్రక్రియ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు షో ఆసక్తిగా మారింది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ హౌస్ లో మొదలైంది. గతంలో జరిగిన సీజన్లలాగా టాస్క్ లు ఎక్కువగా ఇవ్వకపోయినా ఫుడ్ కోసం అనే ఒక కాన్సెఫ్ట్ మాత్రం కొత్తగా ఉంది. రెండు రోజులు జరిగిన ఎపిసోడ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు కానీ నిన్న ఎపిసోడ్ మాత్రం పర్వాలేదనిపించింది.
ఈ సీజన్ లో టాస్క్ లు ఎక్కువగా ఇవ్వలేదు కానీ ఫుడ్ చేసుకుంటాం. మా ఇష్టం అని ఎవరికీ వారే గొడవ పడుతున్నారు. అది కొంచెం విచిత్రంగా ఉంది. హౌస్ లోకి ఫుడ్ కోసం వచ్చారా అని కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక నామినేషన్ విషయానికొస్తే ఎక్కువగా హౌస్ మెట్స్ మణికంఠను టార్గెట్ చేశారు. హౌస్ లో అతని ప్రవర్తన అసంతృప్తిగా ఉందని చెబుతూ నామినేట్ చేశారు. మొత్తం హౌస్ మెట్స్ అందరు మణికంఠను ఎక్కువగా టార్గెట్ చేశారు. ఇక రాత్రి ఎపిసోడ్ లో కూడా నామినేషన్ ప్రక్రియ కంటిన్యూ అయ్యింది. ముందుగా ఆదిత్య ఓం శేఖర్ భాషను నామినేట్ చేశారు. బేబక్క ను నామినేట్ చేశారు. నామినేట్ చెయ్యడానికి కారణాలను వివరించారు. ఇక చీఫ్ లు కూడా శేఖర్ బాషకు ఓటు వేశారు. ఇక ఆ తర్వాత సీత ప్రేరణను, బేబక్కను నామినేట్ చేసింది. వాళ్లను ఎందుకు చేసిందో వివరించింది. విష్ణు ప్రియ శేఖర్ భాషను, సోనియాను నామినేట్ చేసింది. అభినవ్ ముందుగా మణికంఠను నామినేట్ చేశాడు. ప్రేరణ కూడా మణికంఠను నామినేట్ చేసింది. ఈ క్రమంలో తన ఫాస్ట్ గురించి వివరించి తల్లి మరణం తర్వాత ఏం జరిగిందో చెప్పాడు. ఎంత దయనీయ స్థితి నుంచి వచ్చానని స్టోరీ విని హౌస్ మెట్స్ అందరు కన్నీళ్లు పెట్టుకున్నారు.
మణికంఠ చెప్పినప్పుడు అందరు ఏడ్చినా కూడా ఆ తర్వాత అలా చెప్పడం తప్పు అని అరిచారు. ఇక సోనియా తనని నామినేట్ చెయ్యడం పై పెద్ద రచ్చ చేసింది. ఇక మణికంఠ విష్ణు ప్రియను నామినేట్ చేశాడు. ఆమెకు హౌస్ లో హర్హత లేదు అంటూ నామినేట్ చేశాడు. ఆ తర్వాత శేఖర్ భాషను నామినేట్ చేశాడు. అతన్ని ఎందుకు చేశాడు అన్నదానిపై ఎక్సప్లేనేషన్ ఇచ్చాడు.ఈ ప్రాసెస్ అయ్యాక కన్వేషన్ రూమ్ కు బిగ్ బాస్ మణికంఠను పిలిచారు. అక్కడ బిగ్ బాస్ అతనికి మనో ధైర్యం చెప్పి బయటకు పంపించారు.. ఇక ఈ వారం హౌస్ నుంచి బయటకు వస్తారా అన్నది ఆసక్తిగా మారింది.