Bigg Boss.. తెలుగులో బిగ్ బాస్ (Bigg Boss) దాదాపు 7 సీజన్లను పూర్తి చేసుకోగా , అందులో నాన్ స్టాప్ ఓటిటి కార్యక్రమం కూడా ఒకటి పూర్తయింది. ఇక ఇప్పుడు 8వ సీజన్ ప్రారంభమవగా, రెండవ వారం చివరి దశకు చేరుకుంది. ఇకపోతే ప్రతి సీజన్ లో కూడా 20 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపేవారు. అయితే ఈ సీజన్లో కేవలం 14 మందిని మాత్రమే కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి పంపించారు. అందులో మొదటి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి బయటికి వెళ్లిపోయారు. ఇకపోతే ఈ సీజన్ మినీ సీజన్ కూడా కాదు 16 వారాలు అన్నారు. అయితే 9 వారాలకు సరిపడ కంటెస్టెంట్స్ ని మాత్రమే హౌస్ లోకి పంపారు. దీంతో ఏం జరుగుతోందని అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
సెప్టెంబర్ 21న వైల్డ్ కార్డు ఎంట్రీ..
అయితే ఈ సీజన్ మొత్తం ట్విస్ట్ లతోనే ఉంటుందని, ఇప్పటికే నాగార్జున ఎన్నోసార్లు తెలిపారు కూడా.. ఆ ట్యాగ్ లైన్ ని నిజం చేయడానికి ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ విషయాన్ని ఇంకా గోప్యంగా ఉంచాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 21వ తేదీన వైల్డ్ కార్డు ద్వారా దాదాపు 6 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఆ కంటెస్టెంట్స్ వీరే అంటూ కూడా ఒక లిస్టు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.
అవినాష్ తో పాటు మరో ఐదుగురు కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అవినాష్ ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి సీజన్ 4 లో కూడా అవినాష్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారానే ఎంట్రీ ఇచ్చాడు అవినాష్.ఈయన వస్తే ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్ గా ఉంటుందని , అందుకే ఈసారి కూడా వైల్డ్ కార్డు ద్వారానే హౌస్ లోకి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి మొదటి వారమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నయని పావని కూడా ఈ సీజన్లో మరొకసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ముఖ్యంగా గత సీజన్లో ఈమె ఎలిమినేషన్ అన్యాయం అంటూ చాలామంది ఆరోపణలు చేశారు అందుకే ఈ సీజన్లో మళ్ళీ ఈమెకు అవకాశం కల్పించనున్నారు బిగ్ బాస్.
వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చేది వీరే..
అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న మూడవ కంటెస్టెంట్ అంజలి పవన్. ఈమె ఈ సీజన్ ప్రారంభం నుండే రావాల్సి ఉంది కానీ కొన్ని కారణాలవల్ల వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తోంది. ఇక విష్ణుప్రియ కి ప్రాణ స్నేహితురాలిగా పిలవబడే యాంకర్ రీతు చౌదరి కూడా హౌస్ లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈమె తోపాటు గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న జగతి అలియాస్ జ్యోతిరాయ్ , వీరితో పాటు ఒక ఫిమేల్ మోడల్ కూడా హౌస్ లోకి రాబోతోందట. వీరిలో ఒకవేళ ఎవరైనా వారి కారణాల చేత డ్రాప్ అయినట్లు అయితే.. బిగ్ బాస్ -3 లో పాల్గొన్న కంటెస్టెంట్ రోహిణి వారి బదులుగా హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి… ఇక త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.