Bigg Boss.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బిగ్ బాస్ 8వ సీజన్ (Bigg Boss 8). ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా, అందులో అందరికంటే డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న కంటెస్టెంట్ గా పేరు దక్కించుకున్నారు నాగ మణికంఠ (Naga manikanta) . మొదటి వారం టెన్షన్ తట్టుకోలేక ఎమోషనల్ విగ్గు స్ట్రోక్ ఇచ్చిన మణికంఠ, ఆ స్ట్రోక్ కి అటు కంటెస్టెంట్స్ ఇటు ఆడియన్స్ అందరూ అవాక్కైపోయారు. ఇక తర్వాత నెమ్మదిగా ఇంట్లో సభ్యులు ఒక్కొక్కరితో కలిసిపోతూ అందరిని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
సత్తా చాటడం మొదలెట్టిన మణికంఠ..
ఇక తాజా ఎపిసోడ్ లో అందరిని టార్చర్ చేసే యష్మీ చేతే శభాష్ అనిపించుకున్నాడు ఈ యంగ్ నటుడు. అంతేకాదు అర్థరాత్రి దొంగతనాలు చేస్తూ, గట్టిగానే ఏదో ట్రై చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇకపోతే వారం తర్వాత తన ఆట ,మాట తీరుతో అందరినీ ఆశ్చర్యపరిచిన మణి , నిన్నటి ఎపిసోడ్ లో స్పెల్లింగ్ టాస్క్ లో గెలిచి సత్తా చాటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కూడా గట్టిగానే ఫుటేజ్ ఇచ్చారు మణికంఠ. ముందుగా సాక్స్ టాస్క్ లో మణికంఠ భయపడి అటు ఇటు తిరిగాడు అంటూ అభయ్ కొంతమందితో కూర్చొని ముచ్చట పెట్టగా.. అయితే అది విన్న మణికంఠ వెంటనే అభయ్ మీద కోప్పడ్డాడు. నేనేమి భయపడలేదు అన్న ఎంత ఆడాలో అంతా ఆడేసాను అందులో జోక్ చేయాల్సిందేమీ లేదు కదా.. ముఖ్యంగా నా బాడీ మీద ఎవరు జోక్స్ వేయవద్దు.. నాకు మీ అందరితో కలవడం చాలా కష్టంగా ఉంది దయచేసి ఇలా చేయకండి అంటూ చెప్పాడు.
దొంగ బ్యాచ్ అంటూ ఆడియన్స్ కామెంట్స్..
ఆ తర్వాత ట్రూత్ ఆర్ డేర్ విషయంలో విష్ణు ప్రియ డేర్ అని సెలెక్ట్ చేయగానే వెంటనే పోల్ డాన్స్ చేయి అంటూ మణికంఠ అడగడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. ఇకపోతే ఈరోజు ఎపిసోడ్ లో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఎవరిని పట్టించుకోకుండా అందర్నీ టార్చర్ చేసే యష్మినే కాసేపు ఆడుకున్నాడు మణి. మణికంఠ భుజాలను నొక్కుతూ మసాజ్ చేస్తూ కనిపించింది యష్మి. దీనితో అందరూ ఆశ్చర్యపోయారు. పికిల్ బాటిల్ ఎక్కడ దాచావో చెప్పు ప్లీజ్ అంటూ యష్మీ బ్రతిమాలింది. ముందు ప్రేమతో మసాజ్ చేయి కోపంతో కాదు అంటూ మణికంఠ తెలిపాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న నబీల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే ఎపిసోడ్ కే హైలైట్ అని చెప్పవచ్చు. అంత బ్రతిమిలాడినా సరే.. నా గురించి మూడు మంచి మాటలు చెప్పు అంటూ యష్మీ చేతే పొగిడించుకున్నాడు మణికంఠ. ఆ తర్వాత బీన్ బ్యాగులో దాచిపెట్టిన పికిల్ బాటిల్ తీసి ఆమెకు ఇచ్చేశాడు. అయితే ఆ సమయంలో మణికంఠ పౌచ్ ను ప్రేరణ దొబ్బేసింది. యష్మీ తీసిందేమో అనుకున్న మణికంఠ ఇచ్చేయమని బ్రతిమలాడాడు.. అయితే దొరికింది ఛాన్స్ అనుకున్న యష్మీ.. ఒక పాట పాడు, డాన్స్ చేయి అంటూ యష్మి మణికంఠను ఆట ఆడుకుంది. ఆ తర్వాత యష్మీ ని చూస్తూ ఫీలైపోయి, పాట పాడుతుంటే రేయ్ వాడు కసిగా ఉన్నాడు. ఇచ్చేవే బాబు పౌచ్ అంటూ అక్కడి నుంచి పారిపోయింది యష్మి..ఆ తర్వాత యష్మీ టీం ఉన్న రూమ్ లోకి వెళ్లి మణికంఠ చిప్స్ ప్యాకెట్ కొట్టేసి దొంగతనం చేశాడు. ఇలా మొత్తానికైతే ఈ దొంగ బ్యాచ్ ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చార్రా అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.