Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8 Telugu ) ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రెండో వారం నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండు రోజులు నామినేషన్స్ తర్వాత విచిత్రమైన టాస్క్ లను ఇస్తూ పిచ్చెక్కిస్తున్నారు బిగ్ బాస్.. ఎవరి ఫుడ్ వాళ్లే సంపాదించుకోవాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. అందుకోసం మూడు టీమ్స్ సభ్యులు నువ్వా, నేనా అన్న రేంజ్ లో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న జరిగిన ఎపిసోడ్ కు కంటిన్యూ గా ఈరోజు ఎపిసోడ్ కొనసాగానుందని తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఇవాళ ఎపిసోడ్ ప్రోమో హైలైట్స్ ను చూస్తే..
రెండో వారం ఇచ్చిన టాస్కుల లో ఓడిపోయి ఈ వారం మొత్తం రాగిపిండికే పరిమితమైన నిఖిల్ ( Nikhil ) టీమ్.. తాజాగా ఈరోజు జరిగిన టాస్కులలో అదరగొట్టేసింది. రోప్ టాస్కులో పృథ్వీ (Pruthvi ) కి గట్టి పోటీనిచ్చి గెలిచాడు నిఖిల్. ఇక ఆ తర్వాత యష్మీ గౌడ, నైనీకాలు స్పెల్లింగ్ టాస్క్ లో డీలా పడ్డారు. మణికంఠ ఇద్దరిని చిత్తుగా ఓడించారు. నిఖిల్ టీమ్ ప్రైజ్ మనీ ఏకంగా లక్ష 20 వేలకు పెరిగింది. ఆ తర్వాత నైనిక టీమ్ రూ.50 వేలు గెలుచుకుంది..
ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమో విషయానికొస్తే.. కంటెస్టెంట్లకు వ్యాక్స్ చేసుకోవాలంటూ టాస్కు ఇచ్చాడు బిగ్బాస్. వ్యాక్స్ టాస్క్ లో పృథ్వీ, నిఖిల్, నబీల్ (Nabeel ) పోటీపడ్డారు. కానీ ఆట మధ్యలోనే నొప్పిని తట్టుకోలేక పృథ్వీ టాస్క్ నుంచి తప్పుకున్నట్లు ప్రోమోను చూస్తే తెలుస్తుంది. ఇక నిఖిల్, నబీల్ గట్టిగానే పోటి పడ్డారు. నొప్పిని భరిస్తూనే అలానే వ్యాక్స్ చేసుకొనే పనిలో ఉన్నారు. మరి ఈ టాస్క్ లో ఎవరు విన్నర్ అవుతారో మాత్రం తెలియాల్సి ఉంది.
ఇక ఈ టాస్క్ తర్వాత వంట గదిలో సీత ఏదో పని చేసుకుంటూ కనిపిస్తుంది. అప్పుడే యష్మీ (Yashmi ) అక్కడకు వస్తుంది. డస్ట్ బిన్ నుంచి పాలు ప్యాకెట్ కవర్ తీసి.. ఇది ఎవరూ తీశారంటూ సీతను అడిగింది. నాకు తెలీదు.. విష్ణు తీసిందంటూ సీత (Sitha ) చెప్పడంతో విష్ణుతో గొడవకు దిగింది యష్మీ. మా పాల ప్యాకెట్ ఎందుకు తీశావంటూ ప్రశ్నించగా.. మీరు మా చికెన్ కొట్టేయలేదా అని విష్ణు అడగ్గా.. నువ్వు చూశావా.. ప్రూఫ్ ఉందా అంటూ అడ్డదిడ్డంగా వాదించింది. నిజానికి నైనిక టీం గెలిచిన రేషన్ మొత్తాన్ని కొట్టేయాలని తన టీమ్ సభ్యులకు చెప్పింది యష్మీ.. ఆ తర్వాత ప్రేరణ తో కలిసి టాస్క్ విన్ అయ్యి నైనిక గెలుచుకున్న చికెన్ ను కూడా దొబ్బేసింది. మొత్తానికి ఈ వారం టాస్క్ లు కొత్తగా ఉండటంతో మంచి రేటింగ్ వస్తుందని టాక్.. ఇక వారం హౌస్ నుంచి ఎవరు వెళ్తారో చూడాలి..