Bigg Boss.. బుల్లితెర ప్రేక్షకులను మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ 8వ సీజన్ (Bigg Boss season 8) మొదలైంది. ఇకపోతే ఈ షో మొదలై రెండు వారాలు కూడా పూర్తీ కాలేదు అప్పుడే కంటెస్టెంట్ల మధ్య ప్రేమాయణం, చిచ్చు, ఎఫైర్ ఇలా ఎన్నో బిగ్ బాస్ ఆడియన్స్ కి చూపిస్తూ.. షోను రక్తి కట్టిస్తున్నారు. ఇదిలా ఉండగా హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా.. ఒక్కొక్కరిది ఒక్కో మెంటాలిటీ.. మరి వీరంతా ఒకే కుటుంబంలో ఎన్ని రోజులు ఉంటారో తెలియని పరిస్థితి. అందుకే వారిని ఇంకొంత కాలం హౌస్ లో ఉంచేలాగా సెలబ్రిటీలు ఆ కంటెస్టెంట్లకు సపోర్టుగా నిలుస్తూ.. వారికి ఆడియన్స్ నుంచి మద్దతు లభించేలా చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో రాజ్ తరుణ్ (Raj Tarun)కూడా ఒకరు.
అమ్మాయిని మోసం చేసిన రాజ్ తరుణ్..
వివాదాస్పద నటుడిగా ఈ మధ్య పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ పై లావణ్య(Lavanya )అనే యువతీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రేమ పేరుతో వాడుకొని వదిలేసాడని, సహజీవనం చేసి , ఇప్పుడు ఇంకొక నటితో రిలేషన్ పెట్టుకున్నాడని ఆరోపించింది లావణ్య. ముఖ్యంగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని, అందుకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులకు సమర్పించింది. ఇక నిజా నిజాలు తెలుసుకున్న తర్వాత రాజ్ తరుణ్ ను నిందితుడిగా చార్జిషీటులో చేర్చారు పోలీసులు. రాజ్ తరుణ్ లావణ్య పదేళ్లు సహజీవనం చేసినట్లు అందులో స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ , లావణ్య దాదాపు 10 ఏళ్లు ఒకే ఇంట్లో ఉన్నారని, లావణ్య చెప్పేవన్నీ నిజాలే అని పోలీసులు తెలిపారు.
రాజ్ తరుణ్ కు అండగా ఆర్జె శేఖర్ బాషా..
ఇదిలా ఉండగా.. లావణ్య – రాజ్ తరుణ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో..ఆర్జే శేఖర్ బాషా (RJ Sekhar basha) రాజ్ తరుణ్ కు సపోర్టుగా ముందుకు వచ్చారు. లావణ్య పై ఆరోపణలు చేయడమే కాదు ఆమెపై దాడి కూడా చేశారు. ఇలాంటి ఇతడు ఇప్పుడు బిగ్ బాస్ లో కి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇతడికి అండగా రాజ్ తరుణ్ నిలబడ్డారు. తాజాగా భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న రాజ్ తరుణ్ ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో శేఖర్ బాషా కు సంబంధించిన ప్రశ్న ఎదురవగా.. శేఖర్ బాషా నిజం కోసమే నిలబడ్డాడు. సరైన సమయంలో ఆధారాలతో వచ్చి నాకు సహాయం చేశాడు. అందుకే అతడి కోసం వీలైతే నేను బిగ్ బాస్ కి వెళ్లి సపోర్ట్ చేస్తాను అంటూ తెలిపాడు రాజ్ తరుణ్.
శేఖర్ బాషా కు బిగ్ బాస్ లో అండగా నిలుస్తానంటున్న రాజ్ తరుణ్..
అంతేకాదు శేఖర్ బాషా తో తనకు పెద్దగా పరిచయం లేదని, కాకపోయినా తన కోసం అండగా నిలబడ్డాడని, ఒకానొక సమయంలో కొన్ని సినిమా ప్రమోషన్స్ లో మాత్రమే కలిసాం తప్ప అతనితో పెద్దగా స్నేహం లేదని చెప్పుకొచ్చారు. తనకు మంచి చేశాడని , ఇప్పుడు శేఖర్ బాషా తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్. ఇకపోతే శేఖర్ బాషా హౌస్ లో అందరితో కలివిడిగా సెటైర్లు వేస్తూ పంచులతో ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇతడికి అండగా రాజ్ తరుణ్ రాబోతున్నారు. మరి శేఖర్ బాషా కు రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తే హౌస్ లో ఎన్ని రోజులు ఉంటారో చూడాలి.