Bigg Boss.. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, తనదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సోనియా ఆకుల (Sonia aakula) నటనా నైపుణ్యం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో సినిమాలతో మెప్పించిన ఈమె ఇప్పుడు హౌస్ లో కూడా అంతకుమించి ఆట తీరుతో అందరిని మెస్మరైజ్ చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తనను ఒక డైరెక్టర్ ఇంటికి రమ్మన్నారు అని పిలిచి హాట్ బాంబు పేల్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రాంగోపాల్ వర్మ సపోర్ట్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన సోనియా..
సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ పాపులర్ ముద్దుగుమ్మ. సోనియా 2019లో వచ్చిన జార్జి రెడ్డి సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి , ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తో కలిసి కరోనా వైరస్ అనే సినిమా కూడా చేసింది. ఆ తర్వాత ఆశ ఎన్కౌంటర్ సినిమా చేయగా ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోనే బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగు పెట్టింది. తాజాగా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె దడ దడ లాలిస్తూ రెచ్చిపోతుంది.
వర్మ సినిమా అంటే అమ్మాయిలు ఆలోచిస్తారు..
అంతేకాదు మరొకవైపు నిఖిల్ తో ప్రేమ వ్యవహారం కూడా మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు చాలా ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె.. కరోనా సమయంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సోనియా మాట్లాడుతూ.. రాంగోపాల్ వర్మ సినిమాలో నటించాలంటే చాలామంది అమ్మాయిలు వెనుకడుగు వేస్తారు..ముఖ్యంగా ఆర్జీవి సినిమా అంటే చాలామంది ఆలోచిస్తారు.. ఎందుకంటే ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా కూడా బోల్డ్ గా ఉంటుంది. అంతేకాదు కెమెరాలను ఏ యాంగిల్ లో ఎక్కడి నుంచి పెడతాడో అర్థం కాదు. కరోనా వైరస్ సినిమా టైంలో కూడా ఆర్జీవి ఇలా ఫ్యామిలీ తరహా చిత్రం చేస్తున్నారా అని ఆశ్చర్యపోయాను.
ఇంటికి రమ్మన్నారు.. కానీ అనుకున్నదేదీ అక్కడ జరగలేదు.
ఆ తర్వాత ఒకసారి నన్ను ఇంటికి రమ్మన్నాడు. దాంతో చాలా డౌట్స్ నా మైండ్ లో రన్ అయ్యాయి. మోసం చేయడానికా ?లేదా అసభ్యకరంగా ప్రవర్తించడానికా? లేదా ఇంకా ఏదైనా నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా..? ఇలా ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కానీ నేను భయపడినట్లు అక్కడేమీ జరగలేదు అంటూ నవ్వేసింది సోనియా. అంతే కాదు ఇదంతా రాంగోపాల్ వర్మ ముందే ఆమె ధైర్యంగా చెప్పింది.. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఆర్జీవి సపోర్టుతో వచ్చింది కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈమెను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.