Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ నుంచి పారిపోవడానికి గోడ ఎక్కాను… నవదీప్‌కి మాత్రమే తెలిసిన సీక్రెట్ ఇది..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ (Bigg boss) చూసేవారికి ఇదొక ఎంటర్టైన్మెంట్ షో అయినప్పటికీ కూడా హౌస్ లోకి వెళ్లిన వారికి ఒక జైలు లాగా అనిపిస్తుంది అని, చాలా మంది కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత చెప్పుకొచ్చారు.హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మొబైల్ ఉండదు, తెలిసిన వారు ఉండరు, ఎందుకు గొడవ పడుతున్నామో తెలియదు.ఎవరితో గొడవ పడుతున్నామో తెలియదు.. ఆకలి బాధలు.. ఇలా ఒక్కటేమిటి హౌస్ లో ఉన్నన్ని రోజులు అక్కడ వారు అనుభవించే బాధలు వర్ణనాతీతం.

హౌస్ లోకి అడుగుపెడితే ఆ కష్టం వర్ణనాతీతం..

అందుకే హౌస్ లో వెళ్ళాలనుకున్నవారు అన్నింటికీ సిద్ధమైన తర్వాతనే హౌస్ లోకి అడుగుపెడతారు. ఇక హౌస్ లోకి వెళ్ళిన తర్వాత చాలామందికి కుటుంబ సభ్యులు గుర్తుకొస్తారు. భార్య, పిల్లలు ఇలా ఎన్నో వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. దీంతో సడన్ గా హౌస్ నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఒకసారి అగ్రిమెంట్ మీద సైన్ చేసి హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత.. నచ్చకపోతే ఇంటికి వెళ్దామంటే కుదరదు.. ప్రేక్షకులు పంపించాలే తప్ప మనం వెళ్ళిపోవాలనుకుంటే అక్కడ వెళ్ళనివ్వరు. అయితే గతంలో ఒక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మాత్రం హౌస్ లో ఉండలేక, గోడ దూకి వెళ్లిపోవాలనుకున్నారట అయితే రంగంలోకి నవదీప్ ఎంటర్ అవ్వడంతో అసలు నిజం తెలుసుకొని వెనక్కి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. మరి అది ఏ సీజన్..? ఆయన ఎవరు..? అనే విషయం ఎప్పుడు చూద్దాం.

సీజన్ 1 కంటెస్టెంట్ గా ఎన్నో కష్టాలను అనుభవించిన ధనరాజ్.

2017లో తొలిసారి బిగ్ బాస్ సీజన్ 1 మొదలయ్యింది. ఆ సీజన్ కి ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించారు. అందులో 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాగా వారిలో ఒకరు హీరో ధనరాజ్. అంతకుముందు జబర్దస్త్ షోలో కమెడియన్ గా పనిచేసిన ఈయన,ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లడంతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయంపై ధనరాజ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -
Bigg Boss Telugu 8 : I climbed the wall to escape from Bigg Boss... This is the secret only Navdeep knows..!
Bigg Boss Telugu 8 : I climbed the wall to escape from Bigg Boss… This is the secret only Navdeep knows..!

హౌస్ లో ఉండలేక గోడ ఎక్కేసా..

ఒక ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా.. జబర్దస్త్ ఇంత నేర్పిస్తే బిగ్ బాస్ దానికి 100 రెట్లు ఎక్కువ నేర్పించిందా అని హోస్ట్ అడిగితే, దానికి ధనరాజ్ మాట్లాడుతూ.. వీళ్లు పంపించే వరకు మనం వెళ్లడానికి లేదు. ఒకరోజు ఉండలేక గోడ ఎక్కేసాను. కానీ నవదీప్ నన్ను చెడగొట్టాడు. ఒకరోజు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాం అంటే నిజమేనా అంటే అవును అని అన్నాడు. ఉండగలమా అని నేను అడిగితే నచ్చితే ఉంటాం లేకపోతే వచ్చేస్తామన్నాడు. దాంతో నచ్చకపోతే వచ్చేయొచ్చా అని అనుకొని, నేను కూడా వెళ్లడానికి ఓకే చెప్పాను. ఇక చాలాసార్లు హౌస్ లో ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోదామని ఎన్నోసార్లు బిగ్ బాస్ తో చెప్పాను. కానీ రిప్లై వచ్చేది కాదు. ఆ తర్వాత అర్థమైంది.. ఓహో.. ఇతడు ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నాడో , అప్పుడే మాట్లాడుతాడు. మనం అడిగినదానికి సమాధానం చెప్పడు అని అర్థమయింది.

నవదీప్ ఎంట్రీ తో మొత్తం స్పాయిల్..

అయితే ఒక రోజు స్మోక్ రూమ్ ఏరియాలో బట్టలారేస్తుంటే అక్కడ గోడ ఎక్కి బాయ్ బాయ్ సీ యూ అన్నారు. నవదీపు అప్పుడే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చి అక్కడికి వచ్చాడు. ఎందుకు గోడక్కావ్ అని అడిగాడు. దూకేసి వెళ్ళిపోతున్నా అన్నాను. అప్పుడు అగ్రిమెంట్ చదవలేదా అని అడిగాడు.. లేదు ఏముంది ఇస్తే సంతకం పెట్టేసాను అన్నాను. దాంతో నవదీప్ మనకు మనం వెళ్ళిపోతే రూ.25 లక్షలు కట్టాలని తెలుసా..? అని అన్నాడు. దెబ్బకు ఇటువైపు దూకేసాను అంటూ చెప్పుకొచ్చారు ధనరాజ్.

 

View this post on Instagram

 

A post shared by ChotaNews (@chotanewsofficial)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు