Biggboss 8 : బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో స్టార్ మా లో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది. సరిగ్గా రెండు వారాల కింద మొదలైన ఈ రియాలిటీ షో మొదటి రోజు నుండే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగా, ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ కూడా మొదటిరోజు నుండే తమఆటతీరుతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ బిగ్ బాస్ షో లో కెప్టెన్ కి బదులుగా, హౌస్ చీఫ్ లుగా నిఖిల్, నైనిక, యష్మి గౌడ గెలిచారు. ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ తమ తమ ఆటతీరుతో ఆకట్టుకుంటుండగా, ప్రతి ఒక్కరూ ఆటలోనే కాకుండా, నామినేషన్స్ లో కూడా విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ (Biggboss 8) హౌస్ లో రెండో ఎలిమినేషన్ టైం వచ్చేసింది.
రెండో వారం షాకింగ్ ఎలిమినేషన్…
ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో వారం ఎలిమినేషన్ టైం వచ్చేసింది. మొదటివారం బేబక్క ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్స్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం నామినేట్ అయిన వాళ్లలో ఆదిత్య ఓం (Aditya OM), నాగమణికంఠ (Nagamanikantha), నిఖిల్ (Nikhil), పృథ్వీ(Pruthwi), నైనిక(Nainika), శేఖర్ బాషా(Sekharbasha), విష్ణు ప్రియ(VishnuPriya), కిరాక్ సీత(Kirrak Seetha) ఉన్నారు. అయితే ఈ నామినేషన్స్ లో ఎక్కువ శాతం సీత, విష్ణు ప్రియ, నాగమణికంఠ, ఆదిత్య ఓం లో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ సండే రాకుండానే ఎలిమినేషన్ గురించి షాకింగ్ న్యూస్ తెలిసింది. ఈ వారం రెండో కంటెస్టెంట్ గా ఊహించని వ్యక్తిని ఎలిమినేట్ చేసారని తెలిసింది.
అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ఇది…
ఇక ఈ వారం నామినేషన్స్ లో 8 మంది కంటెస్టెంట్స్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందని సమాచారం వచ్చింది. తాజాగా అందిన అప్డేట్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం ఎలిమినేట్ అయింది ఎవరో కాదు “ఆర్జే శేఖర్ బాషా” (RJ Sekharbasha).. ఇది నమ్మశక్యంగా లేకున్నా ఇదే వాస్తవమని తెలిసింది. అయితే ఈ సీజన్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో శేఖర్ బాషా ఒకరు. హౌస్ లో తన ప్రాసలు, పంచ్ లతో ఆడియన్స్ ని మెప్పిస్తూ, ఆట పరంగా, నామినేషన్స్ లో కూడా, అట్రాక్ట్ చేసాడు శేఖర్ బాషా. ఇక రెండో వారం లో ఊహించని విధంగా శేఖర్ బాషాని ఎలిమినేట్ చేసారు బిగ్ బాస్.
నిజానికి వోటింగ్ పరంగా చూసుకుంటే, ఆదిత్య ఓం, నాగమణికంఠ, సీత కి తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం అందింది. ఈ లెక్కన వీళ్ళలో ఒకరు ఎలిమినేట్ కావాలి కానీ, శేఖర్ బాషాని ఎలిమినేట్ చేయడమేంటనీ, బిగ్ బాస్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. పైగా బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ భాషకి కొడుకు పుట్టాడని స్వీట్ న్యూస్ చెప్పిన నాగార్జున (Nagarjuna) వెంటనే, ఇలా ఎలిమినేట్ చేయడం బాగాలేదని కామెంట్స్ వస్తున్నాయి. అయితే శేఖర్ బాషా ఎలిమినేషన్ కి గల కారణాలు తెలీదు గాని, హౌస్ లో తన ఎలిమినేషన్ గురించి ఏమైనా ట్విస్ట్ లు ఏమైనా ఉంటాయా అనేది తెలియాలంటే రేపటిదాకా ఆగాలి.