Biggboss 8 : బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 8 మొదలై నాలుగు రోజులైంది. ఈ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందరూ అనుకున్నట్టే రెండో రోజు నుండే హౌస్ లో ఓ టాస్క్ తో రచ్చ మొదలైంది. ముందుగా హౌస్ చీఫ్ కోసం టాస్క్ జరగగా, అందులో ముగ్గురు గెలిచారు. అయితే ఆ వెంటనే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే ఈ వారం ఎక్కువగా నామినేట్ అయింది మాత్రం నాగమణికంఠ. అందరూ తననే టార్గెట్ చేయడానికి తన వ్యక్తిగత ప్రవర్తనే కారణం అని తెలిసిపోతుంది. హౌస్ లోకి రావడం మొదలు… అనిల్ రావిపూడి అతనితో చేసిన ప్రాంక్ సమయంలోనే నాగ మణికంఠ తన పర్సనల్ కష్టాలు చెప్పుకోవడం స్టార్ట్ చేసాడు. అది ప్రాంక్ అని తెలిసాక చల్లబడ్డా, మిగతా సమయాల్లో హౌస్ మేట్స్ తో అదే విషయాన్నీ చర్చిస్తూ, ఆఖరికి హౌస్ మేట్స్ నామినేషన్ సమయంలో కూడా అదే విషయాన్నీ చర్చిస్తూ ఆడియన్స్ కి విసుగు తెప్పించాడు.
ఎన్ని రోజులు సింపతీ చూపించాలి..
అయితే నాగమణికంఠ (Nagamani kantha) మొదటిసారి తన కష్ఠాలు చెప్పినపుడు హౌస్ లో అందరూ ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు దూరమయ్యారని, తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా దూరంగా ఉందని, తన పాప కోసం ఇక్కడికి వచ్చానని, సెంటిమెంట్ డైలాగులు చెప్పడం మొదలెట్టాడు. కానీ వచ్చిన రోజు నుండీ ఇవే డైలాగులు చెప్తుంటే ఆడియన్స్ కి కూడా విసుగు పుడుతుంది. నామినేట్ చేస్తున్న ప్రతిసారి అదే విషయం చెప్పి ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అతను నిజంగా ఎన్నో కష్టాలు పడ్డా, అవి హౌస్ లో తన బలంగా మార్చుకోవాలి తప్ప, బలహీనతలు కావొద్దని బిగ్ బాస్ కూడా నాగమణికంఠకు చెప్పడం జరిగింది.
సింపతీ స్టార్ ఇప్పుడు విగ్ స్టార్..
ఇక బిగ్ బాస్ (Biggboss8) హౌస్ లో నాలుగు రోజులుగా తన కష్టాలు చెప్తూ హౌస్ కంటెస్టెంట్లపై, ఆడియన్స్ పై సింపతీ స్టార్ గా ముద్రించబడ్డ నాగ మణికంఠ ఇప్పుడు విగ్ స్టార్ అయిపోయాడు. నామినేషన్స్ అయ్యాక బెడ్ రూమ్ లో కూర్చుని ఒక్కడే ఏడుస్తుంటే, అక్కడికి సీత, నిఖిల్ వచ్చి ఊదారుస్తుంటారు. అప్పుడు మణికంఠ మాట్లాడుతూ… “నాకు గేమ్ పైన బ్రెయిన్ పెట్టడం అసలు కావట్లే.. ఇంకెలా ఆడాలి అంటూ ఏడుస్తూ.. నేను హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నా… అంటూ తలకున్న విగ్ ను తీసి పక్కన పడేసాడు. ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. సింపతీ స్టార్ కాస్త ఇప్పుడు విగ్ స్టార్ అయ్యాడు.. అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిన్నటి వరకు ఒకరకమైన సింపతీ అయినా చూపించారు. ఇప్పుడు ఈ వీడియోతో జనాల దృష్టిలో నాగమణికంఠ మరింత కామెడీ అయిపోయాడని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ వారం ఎలిమినేషన్ లో నాగమణికంఠని బయటికి పంపిస్తారా? లేక ఇంకెవరైనా వెళ్తారా అనేది చూడాలి.