Bigg Boss 8.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 (Bigg boss 8) లాంచింగ్ కి సిద్ధమయ్యింది . సెప్టెంబర్ 1 వ తేదీన సాయంత్రం 7 గంటలకు స్టార్ మా చానల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అంతేకాదు రాత్రి 10:00 లోపు ఈ షోలోకి ఎవరెవరు కంటెస్టెంట్ గా రాబోతున్నారు..? హౌస్ లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారు..? అనే విషయాలు తెలియనున్నాయి. ఇదిలా ఉండగా సెప్టెంబరు 1వ తేదీన బిగ్ బాస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కంటెస్టెంట్స్ వీరే పాల్గొనబోయేది అంటూ కొన్ని వార్తలు ఇప్పటివరకు వైరల్ అయ్యాయి. తాజాగా మరొకసారి అంతా సిద్ధం బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ మరొక లిస్టు తెరపైకి వచ్చింది.
బిగ్ బాస్ ఆఫర్ పై క్లారిటీ..
ఈసారి హౌస్ లోకి సీరియల్ యాక్టర్స్, హీరో, హీరోయిన్స్, యాంకర్ సోషల్ మీడియా స్టార్స్ , మోడల్స్ ఇలా చాలామంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు పేర్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్ ,కుమారి ఆంటీ, అమృత ప్రణయ్, బర్రెలక్క వంటి వారు బిగ్‌బాస్ ఆఫర్ గురించి రియాక్ట్ అయ్యారు. తాజాగా హౌస్ లోకి అడుగుపెట్టడానికి కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని, వారంతా హౌస్ లోకి రావడానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ ప్రీమియర్ కి అధికారికంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ముందుగా ఈ సీజన్ లో పాల్గొనడానికి దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారని సమాచారం.
ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే..
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. యాంకర్ విష్ణు ప్రియ భీమినేని, రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా, బెజవాడ బేబక్క, నైనిక , ఆదిత్య ఓం, విస్మయ శ్రీ, మోడల్ రవితేజ, దర్శకుడు పరమేశ్వర్, యాంకర్ కం నటి సౌమ్యారావు, ఖయ్యూం అలీ, గాయకుడు సాకేత్, అంజలి పవన్, యస్మి గౌడ, యాదమ్మ రాజు ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ బిగ్ బాస్ టీం అధికారికంగా ప్రకటించే వరకు ఈ లిస్టు ని మనం ఫైనల్ చేయలేము.
బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా అర్జున్ అంబటి..
ఇకపోతే సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటలకు స్టార్ మా లో ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ షో కి సంబంధించిన అన్ని ఎపిసోడ్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంటాయి. ఇక మరొకవైపు ఈ షో కి ఎప్పటిలాగే అక్కినేని నాగార్జున అయిదవసారి హోస్టుగా వ్యవహరిస్తున్నారు అంటూ వార్తలు రాగా మరొకవైపు ఎన్ – కన్వెన్షన్ కూల్చివేత పై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ.. ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన హోస్ట్‌గా వస్తారా? రారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక అలాగే బిగ్ బాస్ ఇంటర్వ్యూ బజ్ కి సీరియల్ నటుడు అర్జున్ అంబటి హోస్టింగ్ చేయనున్నట్లు నిన్న ప్రోమో కూడా విడుదల చేశారు.