Bigg Boss 8.. అతిపెద్ద రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో , ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కి సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ ఒకటవ తేదీన సాయంత్రం ఏడు గంటలకు స్టార్ మా చానల్లో ప్రసారం కానున్నట్లు ఇటీవలే పోస్టర్ ప్రోమోతో సహా చిత్ర బృందం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ షో కి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారు అంటూ ఒక వార్త తెరపైకి రాగా , అనూహ్యంగా ఇంకొక వార్త అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
భార్య దెబ్బకు ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో..
సాధారణంగా బిగ్ బాస్ లోకి రావాలి అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఈ షో కి వచ్చిన తర్వాత వారి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. అయితే అప్పటికే క్రేజ్ ఉన్న వారికి మాత్రం ఈ షో ఏమాత్రం ఉపయోగపడదు అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే సెలబ్రిటీలుగా కొనసాగిన వారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటకు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో నెగెటివిటీ మూటగట్టుకొని ఎన్నో అవకాశాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒక హీరో భార్య తన భర్తకు బిగ్ బాస్ లోకి వెళ్లడానికి అవకాశం వస్తే, చివరి క్షణంలో ఆమె ఆగ్రహం చెంది ఆయన ను షో నుంచి తప్పుకునేలా చేసిందట మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ నుంచి తప్పుకున్న ఇంద్రనీల్..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, యాంకర్ రీతూ చౌదరి ,మొగలిరేకులు ఫేమ్ ఇంద్రనీల్ , ఆలీ తమ్ముడు ఖయ్యూం, సీరియల్ నటి అంజలి పవన్, యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క, నటి సోనియా సింగ్, సీరియల్ నటి యాష్మి గౌడ , మోడల్ ఊర్మిళా చౌహన్ , నటుడు అభిరామ్ , నటుడు నిఖిల్ ఈ షోలోకి వెళ్లడానికి ఫైనల్ అయ్యారట. అయితే ఈ లిస్టులో చివరి నిమిషంలో ఇంద్రనీల్ తప్పుకున్నట్లు సమాచారం.
మేఘననే కారణం..
అయితే దీనికి గల కారణం ఆయన భార్య మేఘన అని తెలుస్తోంది. బిగ్ బాస్ షో కి వెళ్లవద్దని ఇంద్రనీల్ ను ఆమె ఆపేసారట. బిగ్బాస్ షో కి వెళ్తే పాజిటివ్ ఇమేజ్ కంటే నెగటివ్ ఇమేజ్ ఎక్కువగా వస్తుంది.. అది మీ కెరియర్ కు మైనస్ అవుతుంది. కాబట్టి మీరు హౌస్ లోకి వెళ్లడానికి వీల్లేదు అంటూ గట్టిగా భర్తతో చెప్పిందట. ఇక అంతే భార్య మాటను జవదాట లేక ఇంద్రనీల్ షో కి వెళ్లాలనే ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాన్ని ఒక బిగ్ బాస్ రివ్యూయర్ బయట పెట్టారు. అయితే ఈ విషయం ఇంద్రనీల్ అభిమానులను కాస్త నిరాశపరిచినా.. నిజంగా బయట భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఇంద్రనీల్ ఈ షో కి వెళ్లకపోవడమే మంచిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు . పైగా చాలామంది మేఘనాకు మద్దతు పలుకుతూ ఉండడం గమనార్హం.