Bigg Boss 8: దాదాపు 7 సీజన్లను , అలాగే ఒక ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకుని తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయింది. నిన్న చాలా గ్రాండ్గా సీజన్ 8 లాంచ్ చేశారు. ఎప్పటిలాగే మరొకసారి నాగార్జున (Nagarjuna) తన హోస్టింగ్ తో స్వాగతం చెబుతూ కంటెస్టెంట్స్ అందరిని హౌస్ లోకి ఆహ్వానించారు. ఇక కంటెస్టెంట్స్ అందరూ స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి తమ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పి ఆ తర్వాత హౌస్ లోకి అడుగుపెడుతున్నారు.
హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్..
ఇక మొదట యష్మీ గౌడ హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టగా, రెండవ కంటెస్టెంట్ గా నిఖిల్ మలియక్కల్, 3వ కంటెస్టెంట్ గా అభయ్ నవీన్,4వ కంటెస్టెంట్ గా ప్రేరణ, 5వ కంటెస్టెంట్ గా ఆదిత్య ఓం, 6వ కంటెస్టెంట్ గా సోనియా, 7వ కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క, 8వ కంటెస్టెంట్ గా ఆర్జె శేఖర్ బాషా, 9వ కంటెస్టెంట్ గా కిరాక్ సీత, 10వ కంటెస్టెంట్ గా నాగ మణికంఠ, పృథ్వీ రాజ్ శెట్టి 11వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు.
11వ కంటెస్టెంట్ పృథ్వీ రాజ్ శెట్టి బ్యాక్ గ్రౌండ్..
ఇక ఈయన బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే.. కన్నడకు చెందిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగళూరులో జన్మించిన పృథ్వీ రాజ్ శెట్టి (Prithviraj) తన స్కూల్ కాలేజ్ విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నటన మీద ఆసక్తి పెంచుకున్న పృథ్వీ మొదటిసారి కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఈయన కన్నడ సీరియల్ అర్ధాంగిలో నటిస్తున్నప్పుడు ఆ సీరియల్ మంచి గుర్తింపు అందించింది. ఆ సీరియల్ గుర్తింపుతోనే తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఇక కన్నడ సీరియల్స్ లోనే కాదు కన్నడ సినిమాలలో కూడా నటించారు. కన్నడలో వచ్చిన మహీషా సినిమాలో కూడా పృథ్వీ నటించారు.
నాగ పంచమి సీరియల్ ద్వారా..
ఆ తర్వాత తెలుగు లో నాగపంచమి సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ఈయన, ఆ తర్వాత తన నటనతో, అందంతో, పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను అలరించారు. పృథ్వీ శెట్టి కన్నడలో పలు సీరియల్స్, సినిమాలు చేస్తూ ఇప్పుడు తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక నాగ పంచమి సీరియల్ లో మోక్ష క్యారెక్టర్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్న పృథ్విరాజ్ శెట్టి.. ఈ సీరియల్ ద్వారా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈయనకు పాపులారిటీ భారీగా పెరిగిన నేపథ్యంలో బిగ్ బాస్ లో అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
బిగ్ బాస్ కలిసొస్తుందా. ?
వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకొని హౌస్ లోకి అడుగుపెట్టారు పృధ్వీరాజ్ శెట్టి. మరి ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఈయనకు ఏ విధంగా కలిసి వస్తుంది..? దీని తర్వాత అవకాశాలు క్యూ కడతాయా? లేక అందరిలాగే ఈయనకి కూడా అవకాశాలు రాకుండా పోతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హౌస్ లో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొని పాజిటివ్ రివ్యూ తెచ్చుకుంటే మాత్రం కచ్చితంగా పృథ్వి సక్సెస్ అయినట్లే అని చెప్పవచ్చు.