Bigg Boss 8: ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. ఈసారి కూడా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హోస్ట్ గా మళ్లీ వచ్చేసారు. తన అద్భుతమైన హోస్టింగ్ తో మరొకసారి ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సీజన్ మిగతా సీజన్లో కంటే భిన్నంగా ఉండబోతోంది అని మనకు ప్రోమోల ద్వారా అర్థమవుతుంది. ఇన్ఫినిటీ అంటూ.. లిమిట్ లెస్ అంటూ.. వచ్చిన ఈ షో ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8లోకి నాగార్జున జంటలుగా సెలబ్రిటీలను కంటెస్టెంట్స్ గా ఆహ్వానించారు.
పదవ కంటెస్టెంట్ గా నాగమణికంఠ..
అందులో భాగంగానే ప్రముఖ కన్నడ సీరియల్ నటి యష్మీ గౌడ మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టి హౌస్ కే కల తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇక రెండవ కంటెంట్ గా నిఖిల్ హౌస్ లోకి అడుగుపెట్టారు. మూడవ కంటెస్టెంట్ గా అభయ్ నవీన్ నవీన్ రాగ ఆయనతోపాటు ప్రేరణ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆదిత్య ఓం, సోనియా జంటగా హౌస్ లోకి అడుగుపెట్టగా, బేబక్క , ఆర్ జె శేఖర్ భాష హౌస్ లోకి వచ్చారు. ఇక తొమ్మిదవ కంటెస్టెంట్ గా కిరాక్ సీత, పదవ కంటెస్టెంట్గా నాగ మణికంఠ (Naga manikanta)హౌస్ లోకి అడుగుపెట్టారు.
కన్నీళ్లు పెట్టేస్తున్న నాగ మణికంఠ లైఫ్ జర్నీ..
ఇకపోతే స్టేజ్ పైకి నాగ మణికంఠ రాకముందే ఆయనకు సంబంధించిన రివ్యూ వేయగా.. రివ్యూ అందరిని కంటతడి పెట్టిస్తోంది పుట్టిన రెండు సంవత్సరాలకే తండ్రి మరణించాడు . ఆలనా పాలన అంతా తల్లి చూసుకుంది. ఇక తల్లి చాటు బిడ్డగా పెరిగిన నాగ మణికంఠ చదువులో బాగా రాణించేవారు. ఉద్యోగం సంపాదించాలి అనే క్రమంలో.. తల్లి కూడా క్యాన్సర్ బారిన పడి మరణించడం ఆయనను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. తల్లిదండ్రులు మరణించడంతో ఒంటరి అయిపోయారు .ఇక పట్టుబట్టి ఐటీసీ కంప్లీట్ చేసి ఉద్యోగం కూడా సంపాదించారు. అయితే ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఎవరూ లేరు. ఇక తన తల్లి మరణించే ముందు మళ్లీ నీ కూతురుగా పుడతానని చెప్పిందట. ఇక అందులో భాగంగానే ప్రియా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కూతురిగా తన తల్లి జన్మించింది. అమెరికాలో సెటిలైపోయారు.కూతురిలో తల్లిని చూసుకుంటూ ఉన్న కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. సంపాదించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న నాగ మణికంఠతో విభేదాలు పెట్టుకున్న ప్రియ అతడిని ఇండియా వెళ్ళిపోమని చెప్పిందట. ఇక భార్యను విడిచి ఉండలేక, కూతుర్ని దూరం చేసుకోలేక ఒంటరి అయిపోయి, ఎట్టకేలకు ఇండియా వచ్చేసి సీరియల్స్ లో పనిచేయడం మొదలుపెట్టారు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న నాగమణికంఠ ఇప్పుడిప్పుడే సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కెరీర్ కి ఉపయోగపడుతుందని హౌస్ లోకి వచ్చారు. స్టేజ్ పైకి రాగానే.. ఆఖరిపోరాటం అంటూ బిగ్ బాస్ ద్వారానే తన కెరియర్ మారబోతోంది అంటూ చెబుతున్నారు. మరి నాగమణికంఠ కెరియర్ కు బిగ్ బాస్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.