Bigg Boss 11 : భాష ఏదైనా బిగ్ బాస్ షోకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అన్నీ భాషల్లోని టిఆర్పీ రేటింగ్స్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ నెలలోనే కన్నడ బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ కన్నడ 11 (Bigg Boss Kannada 11)కు సంబంధించిన ప్రోమో గురించి ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ థీమ్ ను ఈసారి కన్నడ బిగ్ బాస్ కాపీ కొట్టబోతున్నారు అంటున్నారు. పైగా దానికి సాక్ష్యంగా ఆర్ఆర్ఆర్ (RRR) టైటిల్ తో పాటు, బిగ్ బాస్ లోగోను పోలుస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ (RRR), బిగ్ బాస్ లోగో మధ్య సంబంధం ఏమిటి?
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ (RRR)తో తాజా బిగ్ బాస్ లోగోను పోలుస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి చర్చలు ఎందుకు మొదలయ్యాయి? RRR సినిమాకి బిగ్ బాస్ (Bigg Boss Kannada 11)లోగోకి ఏమైనా సంబంధం ఉందా? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. బిగ్ బాస్ కన్నడ తాజా సీజన్ (Bigg Boss Kannada 11)కు హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై చాలా కాలంగా చర్చలు జరిగాయి. దీనికి సమాధానం రాగానే బిగ్ బాస్ లోగోను ఆర్ఆర్ఆర్ (RRR)తో పోల్చడం మొదలుపెట్టారు. సుదీప్ కొత్త సీజన్ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు అనే విషయం తాజా ప్రోమోతో కన్ఫర్మ్ అయ్యింది. ఇక ప్రోమోలో చూసుకుంటే బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 (Bigg Boss Kannada 11)లోగో నీలం, నారింజ రంగులో కన్పించి హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు రంగులు ఈసారి బిగ్ బాస్ కన్నడ థీమ్ గా నిర్ణయించారని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ కలర్ బిగ్ బాస్ లోగో సేమ్ ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.
బిగ్ బాస్ 11 (Bigg Boss Kannada 11) థీమ్ ఏంటి ?
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా టైటిల్ లో కలర్ ను సినిమాలో హీరోల పాత్రలను బట్టి డిజైన్ చేశారు మేకర్స్. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రను నీళ్లతో, రామ్ చరణ్ పాత్రను నిప్పుతో పోల్చారు. అదే విధంగా టైటిల్ లో బ్లూ, ఆరెంజ్ కలర్స్ ఉండేలా చూసుకున్నారు. ఈసారి బిగ్ బాస్ 11 (Bigg Boss Kannada 11) కూడా అదే థీమ్ ఆధారంగా రాబోతోందని నెటిజన్లు అంటున్నారు. మునుపటి సీజన్లో కంటెస్టెంట్స్ ను సమర్ధులు, అసమర్థులు అంటూ రెండు గ్రూపులుగా విభజించారు. ఇలా గ్రూపుగా ఏర్పడడంతో సభలో సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈసారి మాత్రం బ్లూ అండ్ రెడ్ థీమ్ అంటే నీళ్లలాంటి స్వభావం ఉన్నవాళ్లను, నిప్పులాంటి స్వభావం ఉన్నవాళ్లను హౌజ్ లోకి పంపిస్తారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని సదరు ఛానెల్ ఎక్కడా ప్రకటించలేదు. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. బిగ్ బాస్ 11 (Bigg Boss Kannada 11) కంటెస్టెంట్స్ ఎవరు ? అనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.