BiggBoss8 : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్8 వచ్చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ వస్తున్న మొదటి సీజన్ నుండి ప్రతి సారి సరికొత్తగా ఎంటర్టైన్ చేస్తూ ఉండగా, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యాక టిఆర్పి రేటింగ్ లు కూడా సినిమాల రేంజ్ లో వస్తూ ఉంటాయి. ఇక మొదట హిందీలో ఈ సీజన్ స్టార్ట్ అవగా, తెలుగులో 2017 లో మొదలై సక్సెస్ ఫుల్ గా 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజెస్, ఎంటర్టైన్మెంట్ తో పాటు కాంట్రవర్సీస్ లతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇక ఇప్పుడు త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందే బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ ని రిలీజ్ చేయగా, తాజాగా మరో ప్రోమోని రిలీజ్ చేసారు.
ఆలోచించుకొండి అంటున్న బిగ్ బాస్…
ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన బిగ్ బాస్ 8 టీజర్ ఆకట్టుకోగా, దానికి కొనసాగింపుగా మరో టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో కూడా కమెడియన్ సత్య ఒక దొంగ పాత్రలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే… అద్భుత దీపం నుంచి వచ్చిన నాగార్జున జీని ఏం కావాలో కోరుకో అంటూ వరాలిస్తాడు. దీంతో నాకు అన్నీ అన్ లిమిటెడ్‌గా కావాలంటూ అంటాడు. అప్పుడు కళ్లు మూసి తెరిచేలోపు బిగ్‌బాస్ హౌస్ మొత్తం అప్సరసలతో నిండిపోతుంది. వారితో ఒక సపరేట్ సాంగ్ కూడా ప్లే చేయగా, ఈ సారి ఎంటర్టైన్మెంట్ పక్కా అంటూ.. ఈ ప్రోమోతో చెప్పేసాడు. ఇక ప్రోమో చివర్లో ‘ఇక్కడ అన్నీ ఉన్నాయి.. లేనిది ఒకే ఒక్కటి అదే ‘లిమిట్’ అంటూ బిగ్ బాస్ సీజన్ 8 కాన్సెప్ట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు.
బిగ్ బాస్ 8 లో పాపులర్ కంటెస్టెంట్స్…
ఇక బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుండి స్టార్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అఫిషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ 8వ సీజన్ లో హౌస్ లోకి ఈసారి బాగా వైరల్ అయిన కాస్ట్ ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తుంది, బిగ్ బాస్ 8 హౌస్ లో విష్ణు ప్రియ, రితూ చౌదరి, బంచిక్ బబ్లు, యూట్యూబర్ అనిల్, యాదమ్మ రాజు, ఖయ్యూమ్ అలీ, సోనియా, ఇప్పటికే కంటెస్టెంట్స్ గా ఫిక్స్ అయ్యారని సమాచారం. అలాగే వేణు స్వామి, క్రికెటర్ అర్జున్, 90స్ హీరో అబ్బాస్, లేటెస్ట్ గా రాజ్ తరుణ్ ని ప్రేమించిన లావణ్య కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని ప్రచారం నడుస్తుంది.