Bigg Boss : అక్కినేని నాగార్జున ( Nagarjuna )కు సంబందించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయంశంగా మారింది. నాగ్ పై ఇటు ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కారణంగా సినీ పరిశ్రమ పెద్దలు మౌనంగా ఉంటున్నారు. అయితే నాగార్జునకు సినీ పరిశ్రమ నుంచి మద్దతుగా ముందుకొచ్చి ఎవరూ మాట్లాడకపోవడం చర్చనీయాంశమవుతున్నది. ఈ క్రమంలో సామాజిక కార్యకర్త, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని ( Babu Gogineni ) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..
హీరో నాగార్జున సినిమాలే కాదు బుల్లితెర పై కూడా తనదైన స్టైల్లో రానిస్తూ ఆకట్టుకుంటున్నాయి. మీలో ఎవరు కోటీశ్వరులు నుంచి బిగ్ బాస్ ( Big Boss) వరకు ఆయన చేసిన షోలు బాగా హిట్ అయ్యాయి. గత 8 సీజన్లలో రెండు సీజన్లు మినహాయించి అన్ని సీజన్లకు ఆయనే హోస్ట్‌గా వ్యవహరించారు. ఎన్టీఆర్ తొలి సీజన్, ఆ తర్వాత నాని మరో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు.. ఈ షోలో ఒక సీజన్ లో బాబు గోగినేని సందడి చేశారు. ఒకవైపు విమర్శలు అందుకున్నా కూడా మరోవైపు తనదైనా శైలిలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సెలెబ్రేటిల పై కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యాడు.
తాజాగా బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో ఆయన చేసిన తీవ్రపదజాలంతో పోస్టు వైరల్ అవుతున్నది.. అక్రమ కట్టడాల పై దారుణమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వహకులు తక్షణమే మార్చాలి. లేదూ హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ హిమ్. బిగ్ బాస్. అక్రమ కట్టడాల దారుణమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వహకులు తక్షణమే మార్చాలి. లేదూ హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి. అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది చర్చలకు దారి తీస్తుంది.
ఇక బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభానికి కొన్ని రోజుల ముందు బాబు గోగినేని అకౌంట్ ద్వారా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. నిజానికి ఆయన అధికారిక అకౌంటేనా? లేదా ఎవరైనా అకౌంట్ సృష్టించి పోస్టు చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇది హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై బిగ్ బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తారో చూడాలి..
ఎలిమినేట్ హిమ్, బిగ్ బాస్!
అక్రమ కట్టడాల దారుణమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వహకులు తక్షణమే మార్చాలి. లేదూ హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి.
ఇట్లు
బిగ్గర్ బాస్ బాబు గోగినేని pic.twitter.com/HQIe2dFfFg
— Babu Gogineni (@GogineniBabu) August 24, 2024