Bigg Boss8 : బుల్లితెర ప్రియులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ 1న ప్రారంభమైందన్న సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే ఈ సీజన్ కి కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బుల్లితెరపై ఎంతో గ్రాండియర్ గా ఉండే ఈ రియాలిటీ షో లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో పలు టీవీ సీరియల్స్ నటులు, సినిమా నటులతో పాటు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఉండగా హౌస్ లో మొదటి రెండు రోజులు హౌస్ ఛీఫ్ కోసం పోటీ జరగగా, ఈ పోటీ లో ముగ్గురు చీఫ్ లు గా ఎన్నుకోబడ్డారు. యష్మి గౌడ, నైనిక, నిఖిల్ వీరు ముగ్గురు హౌస్ చీఫ్ లుగా ఎన్నుకోబడ్డారు.
హౌస్ లో పాపులర్ వ్యక్తి!
ఇదిలా ఉండగా ఈ బిగ్ బాస్ సీజన్ 8 (Biggboss 8) లో హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన 14 మంది హౌస్ మేట్స్ లో ఆడియన్స్ కి బాగా తెలిసిన వ్యక్తి “ఆదిత్య ఓం”. రెండు దశాబ్దాల కింద తెలుగులో “లాహిరి లాహిరి లాహిరిలో” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య ఓం కెరీర్ బిగినింగ్ లో హీరోగా వరుస సినిమాలు చేసాడు. కానీ ఆ తరువాత వరుస పరాజయాలతో ఫేడవుట్ అయ్యాడు. రీసెంట్ గా దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలు చేసినా క్లిక్ అవలేదు. ఇప్పుడు జనాలు పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి, తనని తాను నిరూపించుకునేందుకు మళ్ళీ ఆడియన్స్ కి దగ్గరయ్యేందుకు బిగ్ బాస్ 8 హౌస్ లోకి అడుగుపెట్టాడు.
అసలు షోలో ఉన్నాడా? నామినేషన్స్ లో కూడా ఫైర్ లేదు?
అయితే ఆదిత్య ఓం (Aditya OM) హౌస్ లోకి ఎంట్రీ ఇచినప్పటి నుండి సైలెంట్ గానే ఉన్నాడు. తెలుగు రాదా అనుకుంటే పర్లేదు బాగానే మాట్లాడతాడు. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినపుడు బాగానే పలకరించాడు. కానీ పెద్దగా ఎవరితోనూ మాట్లాడడం మాట్లాడడం లేదు. కొత్త కాబట్టి అలవాటు కావడానికి టైం పడుతుంది అనుకోవచ్చు. అయితే నామినేషన్స్ టైం లో కూడా ఇతనిలో పెద్దగా ఫైర్ లేకపోవడం తన బలహీనతను సూచిస్తుంది. ఇక నామినేషన్స్ లో ఆదిత్య పృత్వి ని, శేఖర్ బాషాని (Shekhar basha) నామినేట్ చేసాడు. అయితే శేఖర్ బాషాని లెజినెస్ గా ఉన్నావని నామినేట్ చేయడం షాకింగ్ గా ఉంది. టీమ్ లో యాక్టీవ్ గా ఉన్నవాళ్లలో శేఖర్ బాషా ఒకరు. నిజం చెప్పాలంటే ఆదిత్య ఓం ఇంకా కాస్త లేజిగా ఉన్నారన్న భావన ఆడియన్స్ కి వస్తుంది. ఏది ఏమైనా ఆదిత్య ఓం ఇంకా హౌస్ లో సందడి చేయాల్సిన అవసరం ఉంది. హౌస్ లో తన కోపాన్ని ప్రదర్శించే సమయం ఎప్పుడొస్తుందా అని వ్యూవర్స్ ఎదురుచూస్తున్నారు.