Bigg Boss.. తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss season 8) రెండవ వారాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మొదటివారం బెజవాడ బేబక్క (Bejawada Bebakka) సిల్లీ రీజన్స్ తో ఎలిమినేట్ అవ్వగా, ఇప్పుడు రెండవ వారం ఆర్ జే శేఖర్ బాషా ను ఎలిమినేట్ చేశారు. ఇకపోతే ఎవరైనా ఎలిమినేట్ అయ్యారంటే బిగ్ బాస్ స్టేజ్ పైన నాగార్జున ముందు మిగతా కంటెస్టెంట్ల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత శేఖర్ బాషా(Sekhar basha) హౌస్ నుండి పోతూ పోతూ ఆ కంటెస్టెంట్స్ అసలు రంగు బయటపెట్టారు.
13 మంది కంటెస్టెంట్స్ లో శేఖర్ బాషాకి అండగా సీత..
ఇకపోతే సండే ఫండే లో భాగంగా కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించిన నాగార్జున (Nagarjuna ) చివరికి సేవింగ్ ప్రాసెస్ లో భాగంగా సీత , పృథ్వీ లు సేవ్ అని చెప్పి వారికి ఆనందాన్ని కలిగించారు. చివరికి ఆదిత్య, శేఖర్ బాషా మిగిలారు. ఈ ఇద్దరిలో నుంచి ఎవరు వెళ్లాలి..? ఎవరు ఉండాలి..? అంటూ కంటెస్టెంట్ నిర్ణయించుకోవాలని కాసేపు ఆట కూడా ఆడించాడు నాగార్జున. చివరికి మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లలో శేఖర్ బాషా కి సీతా మాత్రమే ఓటు వేసింది. మిగిలిన వారంతా కూడా ఆదిత్య కి ఓటు వేశారు. శేఖర్ బాషా తన బిడ్డ కోసం ఆలోచిస్తున్నాడని గేమ్ మీద ఫోకస్ పెట్టడం లేదనే కారణాన్ని ప్రతి ఒక్కరు చూపించారు. అలాగే ఆదిత్య కి బిగ్ బాస్ ఇంట్లో ఉండి, ఆట ఆడి , కప్పు గెలవాలనే కసి ఎక్కువగా ఉందని, అందుకే ఓటు వేస్తున్నామని కూడా చెప్పారు.
ఎలిమినేట్ అవుతూ వారి గుట్టు రట్టు చేసిన శేఖర్ బాషా..
ఇక శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తుంటే సీత ఎక్కి ఎక్కి ఏడ్చింది. చివరకు స్టేజ్ మీదకు వచ్చిన శేఖర్ బాషా తో ఒక ఆట ఆడించాడు నాగార్జున. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లలో రియల్ ఎవరు..? ఫేక్ ఎవరు ..?అని ముగ్గురు కంటెస్టెంట్ల గురించి చెప్పమన్నాడు. సీత నా చెల్లి లాంటిది. ఆమె చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. గుండెల్లో నుంచి మాట్లాడుతుంది. ఇక విష్ణుప్రియ ఇన్నోసెన్స్ కి పర్యాయపదం. చాలా అమాయకురాలు. విష్ణు ప్రియ గురించి చెబుతూ.. బయట చాలామంది ఏవేవో చెప్పారు కానీ విష్ణు ప్రియ ఎంత అమాయకురాల అనుకున్నాను… ఎలా బ్రతుకుతుందో ఏమో అనిపిస్తుంది. ఇక ప్రేరణ చాలా మంచి అమ్మాయి. జెన్యూన్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు.
సోనియా మహంకాళి.. మణికంఠ ఫేక్..
అలాగే సోనియా గురించి చెబుతూ నువ్వు ప్రశాంతంగా ఉన్నావు అనిపిస్తుంది. కానీ నామినేషన్ లో మహంకాళి అయిపోతావు. మణికంఠ కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు. ఆలోచించి ఎలా రియాక్ట్ అవ్వాలో క్యాలిక్యులేట్ చేసుకొని మరీ ఆడతాడు అంటూ చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా.