Bigg Boss.. అందరూ సాఫ్ట్ గా సౌమ్యంగా హౌస్ లో కొనసాగితే ఆడియన్స్ కి మజా ఏమొస్తుంది. ఇక ప్రతి సీజన్ లో కూడా ఎవరో ఒక కంటెస్టెంట్ ఆడియన్స్ ని బాగా విసిగిస్తూ ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు. కాబట్టే ఆ సీజన్లు ఆడియన్స్ ఆకట్టుకుంటూ ఉంటాయి. గత సీజన్ లో అయితే శోభా శెట్టి దెబ్బకు కంటెస్టెంట్లు కూడా దండాలు పెట్టేవారు. ఇక ఈ సీజన్లో శోభా శెట్టి కూడా నా ముందు జుజుబీ అంటూ సైకోయిజం చూపిస్తోంది కన్నడ బ్యూటీ యష్మీ (Yashmi). ఇక యష్మి తానా అంటే తందానా అన్నట్లుగా తయారైపోయాడు మరో కంటెస్టెంట్ పృథ్వి. ఇక వీరందరికీ కూడా శాడిజం లో పోటీ ఇస్తోంది సోనియా.. ఇక వీరందరి శాడిస్ట్ చూస్తూ ఉంటే సైకోయిజం కూడా పరాకాష్టకు చేరిపోయిందేమో అనిపిస్తుంది.
యష్మీ సైకోయిజం..
తాజాగా ముగిసిన ఎపిసోడ్లో యష్మీ సైకోయిజం మరో స్థాయికి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు కేవలం మాటలతోనే చిరాకు తెప్పించిన ఈమె.. ఇప్పుడు చేతలతో ఎక్స్ప్రెషన్స్ తో కూడా దారుణంగా బిహేవ్ చేస్తూ.. అందరిలో విసుగు తెప్పిస్తోంది. ఇక ముందుగా బిగ్ బాస్ పెట్టిన ఫూల్ టాస్క్ లో మణికంఠను ఆపేసి గేమ్ ఫౌల్ చేశాడు పృథ్వీ. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ యష్మీకి చెప్పడానికి వెళ్తే, నా ఇష్టం ఇలానే ఆడతా అంటూ తిక్క సమాధానం చెప్పింది.
నిఖిల్ తో గొడవ..
ఇక నిఖిల్ వాళ్ళ లగ్జరీ రూమ్ లోకి వెళ్ళగానే..” మా గేమ్ మేము ఆడుకుంటాం.. ఇలాగే మేము ఆడుతాం.. క్లారిటీ ఇవ్వం.. అంటూ యష్మీ తిక్కగా సమాధానం చెప్పింది. అలా ఆపడం కరెక్ట్ కాదు కదా.. మణికంఠ ప్లేస్ లో నేను ఉంటే రఫ్ గా కూడా ఆడేవాన్ని, ఎవరో ఒకరి తల పగిలితే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ, మనమంతా ఆర్టిస్టులం అంటూ పృథ్వీ తో నిఖిల్ చాలా కూల్ గా మాట్లాడాడు. దాంతో రెచ్చిపోయిన యష్మీ , నిఖిల్ ఇప్పుడు మా గేమ్ పక్కనపెట్టి నువ్వు అంటున్న దానికి మేము ఓకే చెప్పాలా? నా తల పగిలిపోతుందని నేను పక్కన కూర్చోవాలా? సెంటిమెంట్ తో మాట్లాడి మా గేమ్ ని ఆడకుండా చేయకు.. ఫిజికల్ గా మీరు ఆడాలంటే ఆడుకోండి.. లేదంటే మానేయండి.. మేము మాత్రం ఉండలేము.. మాకు ఇష్టం వచ్చినట్లు ఆడతాము అంటూ యష్మి చెప్పుకొచ్చింది.
పాల ప్యాకెట్ కోసం గొడవ..
ఇక్కడితో ఆగిపోలేదు. తమకు పాల ప్యాకెట్లు ఇంకా రాలేదని, యష్మీ దగ్గర నుంచి విష్ణుప్రియ పాల ప్యాకెట్ తీసుకుంటున్నానని అడిగితే వద్దు అని అంటుంది యష్మి అంటూ విష్ణు ప్రియ తెలిపింది. అయినా సరే తమ చికెన్.. ముందు రోజు కొట్టేశారనే కోపంతో విష్ణు తెలియకుండా తీసుకుంది. ఇది గమనించిన యష్మి డస్ట్ బిన్ నుంచి పాల ప్యాకెట్ కవర్ తీసి మరీ గొడవ పెట్టుకుంది. దాంతో విష్ణు కూడా మా చికెన్ మీరు దొబ్బేశారు కదా అని అడిగితే , చికెన్ తీసుకున్నట్లు ప్రూఫ్ ఏమైనా ఉందా..? ప్రూఫ్ చూపించమని బిగ్ బాస్ ని అడుగు అంటూ తన నోరు పారేసుకుంది. ఇక విష్ణుప్రియ గురించి సోనియాకి చెబుతూ వెక్కిరించింది యష్మి. అంతేకాదు నోటికొచ్చినట్టుగా రెచ్చిపోతూ కామెంట్లు చేసింది. మొత్తానికి అయితే మొన్న సోనియా నిన్న యష్మీ సైకోలా మారిపోయారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.