Bigg Boss.. ఊహించనిది జరిగేదే బిగ్ బాస్ (Bigg Boss). అందుకే ఆడియన్స్ ఊహకు కూడా అందకుండా అద్భుతమైన టాస్క్‌లతో, ఊహించని ఎలిమినేషన్స్ తో ఆడియన్స్ లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నారు బిగ్ బాస్. ఇకపోతే మిగతా సీజన్ల లాగా కాకుండా ఈ సీజన్ చాలా డిఫరెంట్ అంటూ , ఇన్ఫినిటీ అంటూ ఎనిమిదవ సీజన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఇందులో ఊహించని పరిణామాలు అంతకుమించి , ఎక్స్పెక్ట్ చేయని టాస్కులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మొదటి వారంలో భాగంగా బెజవాడ బేబక్క(Bejawada Bebakka)సిల్లీ రీజన్స్ తో ఎలిమినేట్ అవ్వగా , ఇప్పుడు రెండవ వారం ఎలిమినేషన్ కూడా వచ్చేసింది.
మళ్ళీ అన్ ఫెయిర్ ఎలిమినేషన్..
మొదటివారమే అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటే ఇక రెండవ వారం ఈ ఎలిమినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఈవారం నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది ఉండగా, వాళ్లలో వీక్ కంటెస్టెంట్స్ తో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న శేఖర్ బాషా (Sekhar basha) ను ఎలిమినేట్ చేయడం అందరికీ పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఈ సీజన్ లో కాస్తో కూస్తో హౌస్ లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది శేఖర్ బాషా మాత్రమే. ఇంతకంటే వీక్ కంటెస్టెంట్స్ హౌస్ లో చాలామంది ఉన్నప్పటికీ ఎవరు ఊహించకుండా శేఖర్ బాషా ను ఎలిమినేట్ చేయడం నిజంగా బిగ్ బాస్ లో రాజకీయాలు జరుగుతున్నాయంటూ అభిమానుల సైతం కామెంట్ చేస్తున్నారు
స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్..
సాధారణంగా ప్రతి సీజన్లో కూడా ఇలా షాక్ ఇచ్చే ఎలిమినేషన్స్ ఒకటో రెండో జరుగుతాయి. కానీ ఈ సీజన్లో మొదటి నుంచే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న శేఖర్ బాషా ను ఎలిమినేట్ చేయడం అంటే పెద్ద షాకింగ్ వార్త అని చెప్పవచ్చు. నిజానికి శేఖర్ భాషా కంటే వీక్ కంటెస్టెంట్స్ లేరా అంటే అదీ లేదు.. ఎందుకంటే శేఖర్ బాషా కంటే పృథ్వీ, ఆదిత్య, సీత వీళ్లంతా కూడా వీక్ కంటెస్టెంట్లు అనుకోవచ్చు. గతవారం సీతకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. కానీ ఆమెకు పిఆర్టిం లేకపోవడం వల్ల ఆమెకు ఓట్లు పడలేదు. ఇక ఆదిత్య ఓం, పృథ్వీ కూడా శేఖర్ బాషా కంటే బాగా పెర్ఫార్మన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇది మాత్రం ఊహించని ఎలిమినేషన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
రెండు వారాలకు శేఖర్ బాషా రెమ్యునరేషన్ ఎంతంటే..?
ఇక ఏది ఎలా చూసుకున్నా సరే మొత్తానికైతే శేఖర్ బాషా ఎలిమినేట్ అయిపోయారు. ఈరోజు హౌస్ నుండి తిరిగి వెళ్ళిపోతున్న శేఖర్ బాషా కి ఎంత పారితోషకం అని ఇచ్చారు అనే విషయం వైరల్ గా మారింది. మొదటి రోజు నుంచి ఈరోజు వరకు.. అంటే 15 రోజులు హౌస్ లో వున్నారు కాబట్టి రోజుకు రూ .2లక్షలు చొప్పున మొత్తం 15 రోజులకు గానూ రూ.30 లక్షలు శేఖర్ బాషా రెమ్యునరేషన్ తీసుకుబోతున్నారని సమాచారం. మొత్తానికైతే హౌస్ లోకి వచ్చి ఆడియన్స్ ను ఆకట్టుకొని, ఊహించని ఎలిమినేషన్ తో వెనుతిరిగిపోతుండడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెప్పవచ్చు.