Bigg Boss.. నిఖిల్ (Nikhil). ఈయన గురించి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కానీ బుల్లితెర సీరియల్స్ చూసేవారికి బాగా సుపరిచితుడే. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss season 8) లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సుపరిచితుడు అయిపోయారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ 2 వారాలను పూర్తి చేసుకుంది. దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా , రెండు వారాలలో భాగంగా ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు తొలి వారంలో బిగ్ బాస్ లో ముగ్గురు ఛీఫ్స్ ఎన్నిక అవ్వగా , నిఖిల్ మలయక్కల్ మాత్రమే నిజాయితీగా ఆడుతూ బెస్ట్ అనిపించుకున్నారు. ముఖ్యంగా సండే ఫండే లో భాగంగా సోనియాకు ఫేవర్ ఉన్నట్టు కనిపించిన నిఖిల్ , ఆ తర్వాత తన ఆట తీరుతో నాగార్జునని కూడా ఇంప్రెస్ చేశారు. చీఫ్ గా నిఖిల్ మాత్రమే బెస్ట్ అని, హౌస్ నుంచి శాసించే అధికారం ఈయనకు మాత్రమే ఉందని, నైనిక, యష్మీ లు చీఫ్ గా ఉండడానికి అర్హులు కారు అని కూడా ఆయన ప్రకటించారు..
గేమ్ పై ఫోకస్ చేస్తూ సత్తా చాటుతున్న నిఖిల్.
ఇకపోతే తన క్లాన్ లో ఒక్కరే ఉన్నా .. ఆయన టీం రేషన్ లేకున్నా, వేరే కంటెస్టెంట్స్ డీ మోటివేట్ చేస్తున్నా సరే తన గేమ్ మీదే ఫోకస్ చేశారు నిఖిల్. ఈ క్రమంలోని ఈయన గురించిన పలు వార్తలు బాగా వైరల్ అవుతుండగా.. అందులో భాగంగానే ఆయన లైఫ్ స్టైల్ గురించి , లవ్, బ్రేకప్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నిఖిల్ తొలి పరిచయం.
నిఖిల్ అసలు పేరు నిఖిల్ మలయక్కల్. కర్ణాటక కు చెందిన వ్యక్తి. కన్నడ సినిమాలలో హీరోగా చేసిన ఈయన అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో తెలుగు ఇండస్ట్రీలోకి గోరింటాకు అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్రవంతి , అమ్మకు తెలియని కోయిలమ్మ ఇలా పలు సీరియల్స్ లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన సీరియల్స్ తో పాటు టీవీ షోలో కూడా పాల్గొంటూ మంచి పాపులారిటీ అందుకున్నారు.
పెళ్లి చేసుకుంటారంటూ రూమర్స్ వైరల్..
నిఖిల్ తొలి సీరియల్ గోరింటాకు లో నటిస్తున్నప్పుడు కావ్య శ్రీ తో పరిచయం ఏర్పడింది. ఆమె కూడా కర్ణాటకకు చెందింది. ఇక గోరింటాకు సీరియల్ సూపర్ హిట్ అవడంతో అదే సమయంలో కావ్య – నిఖిల్ జంటకి కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎంటర్టైన్మెంట్ షో లతో పాటు పలు షో డాన్స్ షోలలో కూడా పాల్గొన్నారు. ఇద్దరు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి, ఫోటోలు, రీల్స్, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని, చాలా రోజులుగా రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి.
నిఖిల్ – కావ్య బంధానికి బ్రేక్..
ఇదే విషయంపై ఒక షోలో మాట్లాడగా.. కావ్య చాలా మంచి అమ్మాయి, తను బెస్ట్ ఫ్రెండ్ గా దొరకడం తన అదృష్టం అని కూడా చెప్పాడు నిఖిల్. మరి పెళ్లి మాట ఏంటి అని అడిగితే. ఇప్పట్లో అలాంటిదేమీ లేదని, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ యూట్యూబ్లో వీడియోలు పెట్టడం మానేశారు. సోషల్ మీడియాలో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఏదో భేదాభిప్రాయం వచ్చింది మళ్ళీ కలుసుకుంటారనుకుంటే అదీ లేదు. నిఖిల్ బిగ్ బాస్ కి సెలెక్ట్ అయినప్పుడు ఆయన ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెప్పారు కానీ కావ్య నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ప్రస్తుతం నిఖిల్ సింగిల్ అని చెబుతూ ఆట మీద ఫోకస్ చేస్తున్నారు. దీనికి తోడు తన జీవిత భాగస్వామిని తన తల్లి తీసుకొస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికైతే నిఖిల్ – కావ్య బంధానికి బ్రేకులు పడ్డాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.