Bigg Boss 8.. బిగ్ బాస్ సీజన్ 8లో యంగ్ నటుడిగా అడుగుపెట్టిన నాగమణికంఠ (Naga manikanta) హౌస్ లో సింపథీ గేమ్ ఆడుతున్నాడు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే అదే సింపథీ ఆయనను మొదటి వారం ఎలిమినేషన్ నుంచి కాపాడింది అని చెప్పవచ్చు. ఇకపోతే హౌస్ లో తన భార్య గురించి మణికంఠ చెప్పిన మాటలు..అతని భార్యపై తీవ్ర వ్యతిరేకతను కలిగించింది. ఆమె పెద్ద విలన్ అని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ లోకి రావడానికి తన భార్య కారణమని, షాపింగ్ చేయమని డబ్బులు కూడా పంపించింది అంటూ మళ్ళీ హౌస్ లో చెప్పుకొచ్చాడు. దీంతో నాగ మణికంఠ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని అతడి భార్య ,కూతురు ఫోటోలు చూడాలని అభిమానులే కాదు నెటిజన్స్ కూడా తెగ సర్చ్ చేసారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి నాగమణికంఠ పెళ్లి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
కితకితలు -2 చూసినట్లుంది..
నాగ మణికంఠ శ్రీ ప్రియ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి వీడియోలో ఈమె కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో ఈమె శరీరాకృతిపై నెటిజన్స్ చాలా దారుణంగా కామెంట్ చేశారు. ఈ అమ్మాయి కోసమా నువ్వు ఇంతలా ఏడ్చావు.. మా అందరికీ కితకితలు 2 సినిమా చూసినట్లుంది అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నాడు అంటూ చాలా అసభ్యకరంగా కామెంట్లు చేశారు. ఇప్పటికీ కూడా చాలామంది ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మణికంఠ సోదరి కావ్య అమర్నాథ్ తన వదినకు అండగా నిలుస్తూ మణికంఠ భార్యపై వస్తున్న కామెంట్స్ పై ఆమె ఫైర్ అయ్యింది.
వదినకు అండగా మణికంఠ సోదరి..
కావ్య అమరనాథ్ మాట్లాడుతూ.. మా అన్న వదినల పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉండడం నా దృష్టికి వచ్చింది. ఆ వీడియోకి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూస్తే నన్ను మరింత బాధ పెట్టాయి. కితకితలు సినిమా రెండో పార్ట్ చూసినట్లు ఉంది అంటూ ఆమె శరీరం గురించి జోకులు వేయడం పద్ధతి కాదు. ఇది హీనమైన చర్య అని నేను భావిస్తున్నాను. మా వదిన సౌందర్యవతి, ఆమె మనసు బంగారం, ఆమె చాలా ప్రేమ కలిగిన వ్యక్తి, దయా గుణం ఉన్న ఆమె, ఇలా ఎన్నో లక్షణాలు ఆమెను మరింత అందంగా మార్చాయి. మాకు తల్లి లేకపోవచ్చు కానీ మాకు తల్లిగా ఆమె నిలబడింది. ఆమెపై బాడీ షేవింగ్ చేయడం ఆపేయండి. బరువు తగ్గమని చెప్పడం వల్ల వారికి నష్టమే ఎక్కువ జరగవచ్చు కదా.. దయచేసి ఇతరులను బాధ పెట్టడం పద్ధతి కాదు.. మీ నెగెటివిటీని పక్కనపెట్టి ప్రేమను పంచండి. అవతలి వారు ఎలా ఉన్నారు అన్న దానికి బదులుగా ఎలాంటి వారో తెలుసుకుని వారిని మెచ్చుకోండి అంటూ కావ్య చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే తన వదిన గయ్యాలి కాదు దేవత అంటూ ఒక మాటలో క్లారిటీ ఇచ్చింది కావ్య. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.