Bigg Boss 8 Telugu Promo : బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss).. తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదోవ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఈ షో ఎనిమిదోవ సీజన్ రీసెంట్ గా ప్రారంభం అయ్యింది. ఆదివారం సెప్టెంబర్ 1 గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ షో రెండు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. తాజాగా మూడో ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ మేకర్స్ రిలీజ్ చేశారు. నామినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
గత రెండు రోజులు పెద్దగా టాస్క్‌లు అయితే ఇవ్వలేదు కానీ ఫుడ్ కోసమే హౌస్ లోకి కంటెస్టంట్స్ వచ్చినట్లు దానిమీదే గొడవలు పడ్డారు. ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేశారు. ఇది జనాలను అంతగా ఆకట్టుకోలేదు.. ఈ పాయింట్ కాస్త బోర్ కొట్టింది. ఇక నిన్నటీ ఎపిసోడ్ లో చీఫ్ లను ఎంపిక చేసి నామినేషన్ నుంచి సేఫ్ అని బిగ్ బాస్ చెప్పింది. హౌస్ మెట్స్ ను ఎలిమినేషన్ కోసం నామినేట్ చెయ్యమని బిగ్ బాస్ చెప్పారు.. ఇక ఎవరికీ నచ్చిన వాళ్లను వాళ్లు నామినేట్ చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తం అనవసరంగా గొడవలు పెట్టుకున్నారు. లాజిక్ లేకుండా హౌస్ మెట్స్ అరవడం జనాలకు చిరాకు తెప్పిస్తుందని తెలుస్తుంది. ఇక తాజాగా మూడో రోజు ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో నామినేషన్ గురించే పెద్ద రచ్చ జరుగుతుంది. కావాలనే అందరు మణికంఠను టార్గెట్ చేశారా అని జనాలు అభిప్రాయపడుతున్నారు. విష్ణు ప్రియ (Vishnu Priya )ను కూడా ఇతను ఓ రేంజులో ఆడుకున్నాడని తెలుస్తుంది. మూడు రోజులు అందుకే నీతో తిరిగాను అంటూ మని సమాధానం చెప్పడంతో విష్ణు ప్రియ మోహం ఎర్రగా మారిపోయింది. ఇక శేఖర్ భాష (Sekhar Bhash) కూడా మణికంఠను నామినేట్ చేశాడు. శేఖర్ భాషా పాలిటిక్స్ చెయ్యొద్దు.. ఎమోషనల్ గా విన్ అవ్వాలని అనుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక అభి కూడా మణికంఠ (Manikanta)ను నామినేట్ చేశాడు. ఇలా ప్రతి ఒక్కరు అతన్ని నామినేట్ చెయ్యడం తో అతను ఎమోషనల్ అయ్యాడు. తన లైఫ్ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు. అందరిని తన కథ చెప్పి ఏడ్పించేసాడు.. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ కాస్త కన్నీళ్లతో సాగుతుందని అర్థమవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి..