Bigg Boss 8 Telugu.. ఎట్టకేలకు తెలుగు బిగ్ బాస్ (Bigg Boss)సీజన్ 8 ప్రారంభం అవ్వగా అప్పుడే మూడవరోజు కూడా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ మూడు రోజుల్లోనే అప్పుడే హౌస్ లో ఎన్నో విషయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మొదటి వారం నామినేషన్ లో భాగంగా ఎవరికి వారు ఎదుటివారిపై రీజన్స్ చెబుతూ నామినేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హౌస్ లో చాలామంది ప్రముఖ యంగ్ నటుడు నాగమణికంఠను టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్న కంటెస్టెంట్ కూడా ఇతనే అని చెప్పవచ్చు.
అప్పుడే పులిహోర కలిపేస్తోన్న విష్ణు ప్రియ.
ఇక పొట్టి పిల్ల గట్టిది అన్నట్టు తనదైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది నైనిక. అలాగే సోనియా ఆకుల కూడా తన పెర్ఫార్మెన్స్ తో స్ట్రాటజీతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే గతంలో లక్షల రూపాయలు పారితోషకంగా ఇచ్చినా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను అంటూ సంచలన కామెంట్లు చేసిన హాట్ యాంకర్ విష్ణు ప్రియ ఎట్టకేలకు సీజన్ 8 లోకి వచ్చేసింది. ఇక్కడ ఎవరు ఎటు పోతే నాకేంటి అంటూ తనదైన రీతిలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇక అందులో భాగంగానే విష్ణు ప్రియ గేమ్ పైన ఫోకస్ చేయకుండా పులిహోర కలిపే ప్రయత్నం చేస్తోంది.
ప్రేమించమని డైరెక్ట్ గా అడిగేసిన విష్ణు ప్రియ..
ముఖ్యంగా గేమ్ లో భాగంగా టైటిల్ కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తోంది. కనీసం వారం కూడా గడవకముందే ప్రేమ కథ మొదలు పెట్టేసింది. మేల్ కంటెస్టెంట్స్ తో విష్ణుప్రియ సన్నిహితంగా ఉంటోంది . తాజాగా సీరియల్ నటుడు పృధ్వీరాజ్ కి నేరుగా వల విసిరేసింది. అతడికి కిచెన్లో సేవలు చేస్తోంది. అంతేకాదు పృథ్వీరాజ్ కి కాఫీ తయారు చేసి ఇస్తూ.. నీకు సేవలు చేస్తున్నాను నన్ను ప్రేమించొచ్చు కదా అంటూ అడిగింది.. దానికి పృథ్వి.. ఏంటి కాఫీ ఇచ్చినందుకే ప్రేమించేస్తారా..? అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఒక అబ్బాయిని ప్రేమించమని నేరుగా అడిగిన విష్ణు ప్రియా తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
టైటిల్ కోసం భారీ ప్లాన్..
నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంటకు మంచి మైలేజ్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. ఆ సీజన్లో టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి తో లవ్ ట్రాక్ నడిపాడు. వీరిద్దరి రొమాంటిక్ డ్రామా సూపర్ హిట్ అయింది. సీజన్ 4 లో మోనాల్ – అఖిల్ సార్ధక్ సీరియస్ గా ప్రేమలో పడిపోయారు . ఇక సీజన్ 5 లో షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు స్నేహం అంటూనే ముసుగులో ప్రేమాయణం సాగించారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణం కొనసాగించిన ఏ జంట కూడా బయట అలా కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే ఇదంతా గేమ్ కోసం అని తెలుస్తోంది. మరి బిగ్బాస్ 8 లవర్స్ గా విష్ణు ప్రియ పృథ్వీరాజ్ అవతరిస్తారేమో చూడాలి. ఏది ఏమైనా టైటిల్ కోసమే ఇదంతా అన్నట్టు స్పష్టం అవుతోంది.