Bigg Boss 8 Telugu.. బుల్లితెరపై ఎట్టకేలకు బిగ్ బాస్ (Bigg Boss)8వ సీజన్ మొదలైంది. ఇందులో నాగార్జున (Nagarjuna) మళ్ళీ హోస్టుగా బాధ్యతలు చేపట్టగా, దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అలా వచ్చిన వారిలో పదవ కంటెస్టెంట్ గా యంగ్ నటుడు నాగ మణికంఠ హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే అడుగు పెట్టకు ముందు ఆయనకు సంబంధించిన ఒక ఈవీ వెయ్యగా, అందులో తన భార్య గురించి ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు తన గతం గురించి కూడా తెలిపారు.
తల్లిదండ్రులు కోల్పోయి ఏకాకి అయినా మణికంఠ..
పుట్టిన రెండేళ్లకే తన తండ్రి మరణించాడని, తన తల్లే ప్రపంచంగా అనుకుంటున్న సమయంలో ఆమె కూడా క్యాన్సర్ తో మరణించిందని , దాంతో తల్లిదండ్రులు లేని ఏకాకిని అయ్యాను అంటూ బరువెక్కిన గుండెతో కన్నీళ్ళ రూపంలో తన బాధను చెప్పుకొచ్చారు మణికంఠ. ఇక మరణిస్తూ తన తల్లి తనకు ఒక మాట ఇచ్చిందట. నీకు పెళ్లి జరిగితే నీ కడుపున నేనే మళ్ళీ పుడతాను అంటూ తన తల్లి తనతో చెప్పినట్లు చెప్పుకొచ్చారు. అందులో బాగానే ప్రియా అనే అమ్మాయిని వివాహం చేసుకోగా, వారికి ఒక పాప పుట్టిందట. తన తల్లి పుట్టిందని సంబరపడిపోయారు.. అయితే ఆ తర్వాత డబ్బు సంపాదించమని తన భార్య తనను ఇబ్బందులకు గురిచేసి, ఇండియాకు పంపించేసింది అన్నట్టుగా ఈవీ లో చూపించారు.
నాగ మణికంఠ భార్య ఇంత శాడిష్టా..
ఇక ఇదంతా చూసిన ఆడియన్స్ మణికంఠకు ఎన్ని కష్టాలో అనుకున్నారు. అతడి భార్య విలన్ అని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ మణికంఠ తన భార్య బంగారం అంటున్నాడు . లైవ్ ఎపిసోడ్లో ఆర్ జె శేఖర్ బాషాతో తమ మధ్య గొడవలు ఏం లేవని, ఇప్పటికీ భార్యతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నట్లు తెలిపాడు. అయితే అలా ఈవీ లో చూపించేసరికి అందరూ ఆమె విలన్ అనుకున్నారు. కానీ నిజంగా తన భార్య బంగారం అంటూ ఆమె క్యారెక్టర్ గురించి లైవ్ లో చెప్పారు మణికంఠ.
నా భార్య విలన్ కాదు.. బంగారం..
మణికంఠ మాట్లాడుతూ.. బిగ్బాస్ కి వచ్చే ముందు కూడా నా భార్య ఫోన్ చేసి కచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. నీకు కావాల్సిన డబ్బు కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పింది. కానీ నేను ఆ డబ్బును అప్పుగా ఇవ్వమన్నాను. అప్పుడు నా భార్య భార్యాభర్తల మధ్య అప్పేంటి అంటూ తోసిపుచ్చింది. అలా ఆమె నన్ను బిగ్ బాస్ కి వెళ్ళమని ఎంకరేజ్ చేసింది. అంతేకాదు నా షాపింగ్ కి కూడా ఆమె డబ్బులు పంపింది అంటూ తన భార్య మంచి మనసు గురించి చెప్పుకొచ్చారు మణికంఠ.
డబ్బు సంపాదించడానికే ఇండియా వచ్చా..
మణికంఠ మాట్లాడుతూ.. టైటిల్ విన్నర్ అవ్వాలన్న ఆశ అయితే లేదు. కానీ కొట్లాడైనా, ఏడ్చైనా , నవ్వైనా, నవ్వించైనా చాలా రోజులు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను అంటూ తెలిపారు.మొత్తానికి అయితే భార్యతో గొడవపడి అమెరికా నుంచి వచ్చేసాడే తప్ప విడిపోయి కాదని, అతడి మాటలతో స్పష్టమైపోయింది. ఏది ఏమైనా భార్యాభర్తలిద్దరూ కూతురు కోసం సంపాదించాలన్న ఆలోచనతోనే ఇలా ఎవరికి వారు దూరంగా ఉంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ తర్వాత మళ్లీ తన భార్య దగ్గరకు మణికంఠ డబ్బు సంపాదించి వెళ్లినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.