Bigg Boss 8 Telugu : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 8 రోజు రోజుకు ఉత్కంటగా మారుతుంది. మొదటి వారం బేబక్క (Bebakka) అనూహ్యంగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లింది. ఇక హౌస్ లో రెండో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ నామినేషన్స్ కూడా ప్రేక్షకుల మధ్య చిచ్చు పెట్టాయి. ముఖ్యంగా టాప్ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టేసింది. కొందరు కంటెస్టెంట్లు మాటల యుద్ధం చేసుకున్నారు. సోనియా మరోసారి సీత, విష్ణుప్రియతో ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఆదిత్య ఓం కాస్త గట్టిగా మాట్లాడారు. శేఖర్ బాషా (Sekar Basha) ను టార్గెట్ చేశారు.. మరి ఈ వారం ఎవరిని హౌస్ మెట్స్ ఎక్కువగా నామినేట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
గత వారం బేబక్క నామినేట్ అయ్యారంటూ క్రిరాక్ సీత బాధపడుతుండటంతో ఈ ఎపిసోడ్ షురూ అయింది. నైనిక కూడా పక్కనే ఉన్నారు. సీతను నిఖిల్ ఓదార్చారు. నామినేషన్లలో డిఫరెంట్ ఆదిత్యను చూపిస్తానని సీతతో అతడు చెప్పారు. ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్’ పాటకు గంతులేస్తూ 8వ రోజును కంటెస్టెంట్లు మొదలుపెట్టారు. ఎలిమినేట్ అవుతుందని అనుకున్న సోనియా.. ఫస్టే సేవ్ అయిందని విష్ణు చెప్పారు. సోనియా చీఫ్ కూడా అవుతుందని నైనిక అంచనా వేసుకున్నారు.. ఆ తర్వాత నిఖిల్ మణికంఠ హౌస్ లో ఎలా ఉండాలనేది మాట్లాడుకున్నారు.
ఇక పృథ్విరాజ్, సోనియా క్లోజ్‍గా మాట్లాడుకున్నారు. ప్రేమలో స్వేచ్ఛ ఇవ్వాలంటూ విష్ణుప్రియ (vishnu priya) మధ్యలో వచ్చారు. ఎంత మందికైనా ప్రేమ పంచొచ్చని పృథ్వితో చెప్పారు. దీంతో అందరూ నవ్వారు. సిగరెట్ తాగకుండా ఉంటే ఏం అడిగినా ఇస్తానని నిఖిల్‍తో సోనియా చెప్పారు. షో అయిపోయే లోపు మానేస్తానని సోనియాకు నిఖిల్ మాటిచ్చారు.. అంతేకాదు నీకు ఏం కావాలన్న ఇస్తానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది..
ఆ తర్వాత కాసేపటికి నామినేషన్స్ మొదలయ్యాయి.. చీఫ్ కావడంతో యష్మీ సేఫ్ అని బిగ్ బాస్ చెప్పాడు..నిఖిల్, ప్రేరణను కిర్రాక్ సీత నామినేట్ చేశారు. బయట ఫ్రెండ్‍షిప్ పెట్టుకొని వచ్చి కొందరు ఫాలో కావొచ్చని.. అయితే వేరే వాళ్లు కూడా ఫాలో కావాలని చెప్పొద్దని ప్రేరణతో సీత అన్నారు. చెత్త కుప్పలో బాటిల్ తీసి బయటపెట్టడాన్ని కూడా ప్రస్తావించారు. బయటి నుంచి ఫ్రెండ్‍షిప్ అనే మాట మళ్లీ అనొద్దని ప్రేరణ వారించారు. బాటిల్ విషయంలో సీత అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య గొడవ బాగా గట్టిగానే జరిగింది.
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తూ వివరణ ఇచ్చారు. నైనిక, సీతను సోనియా నామినేట్ చేశారు. నైనిక వల్ల వారి క్లాన్ వారిపై భారం పడిందని కారణం చెప్పారు. ఆ తర్వాత సోనియా, సీత మధ్య ఫైట్ జరిగింది. టాస్కుల విషయాల్లో సీతకు క్లారిటీ లేదని సోనియా అన్నారు. తనకు క్లారిటీ చాలా ఉందని, అన్నీ తెలుసని సీత అన్నారు. నీకే క్లారిటీ లేదని సోనియాపై సీత ఫైర్ అయ్యారు. ఆ తర్వాత సీత ఓ అభ్యంతరమైన పదం వాడారు. దీంతో పిచ్చి మాటలు మాట్లాడొద్దంటూ సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మొత్తం నామినేషన్స్ హీటేక్కించాయి..
ఇకపోతే రెండోవారం రెండో నామినేషన్ ప్రక్రియ రేపటి ఎపిసోడ్‍లోనూ ఉండనుంది. మరికొందరు నామినేట్ చేయాల్సి ఉంది. ఈ వారం నామినేషన్లలో ఎవరు ఉండనున్నారో ఫుల్ లిస్ట్ బయటికి వచ్చేసింది. రెండో వారం ఎలిమినేషన్ కోసం పృథ్విరాజ్, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నిఖిల్, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోసారి మణికంఠ పేరు రావడంతో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. మరి ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారో చూడాలి..