Bigg Boss 8 Day 13 promo.. బిగ్ బాస్ (Big Boss) రెండవ వారం చివరి దశకు చేరుకుంది. ఇక శని, ఆదివారాలలో కంటెస్టెంట్స్ మిగతా రోజుల్లో ఆడిన ఆటకు, ఇచ్చిన పర్ఫామెన్స్ కి సరైన జడ్జిమెంట్ హోస్ట్ నాగార్జున (Nagarjuna ) ఇస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు శనివారం ఎపిసోడ్లో భాగంగా ముగ్గురు చీఫ్స్ పర్ఫామెన్స్ ను జడ్జ్ చేశారు నాగార్జున. స్టేజ్ పైకి రాగానే కంటెస్టెంట్స్ కి గన్ గురిపెట్టి వారి గుండెల్లో గుబులు పుట్టించారు. ముందుగా ఇంటికి చీఫ్ గా నియమితులైన కంటెస్టెంట్స్ ని నిలబెట్టి కడిగిపారేశారు. ముఖ్యంగా చీఫ్ గా యష్మీ (Yashmi ) ఫెయిల్ అయ్యిందంటూ సాక్షాలతో సహా నిరూపించి, ఆమెను తూటాతో పేల్చేశారు..తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.
చీఫ్స్ పై మండిపడ్డ నాగార్జున..
బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవ్వగానే మొదటి రెండు ఎపిసోడ్లలో ఇంటికి చీఫ్స్ గా ముగ్గురిని బిగ్ బాస్ నియమించిన విషయం తెలిసిందే. అందులో నిఖిల్, నైనిక, యష్మి ఇంటికి చీఫ్ గా నియమించబడ్డారు. ఇక వీరు రెండు వారాలపాటు ఇచ్చిన పర్ఫామెన్స్ కి తాజాగా జడ్జిమెంట్ ఇచ్చారు నాగార్జున. ఇక అందులో భాగంగానే ముగ్గురు చీఫ్స్ ను స్టాండప్ చేసిన నాగార్జున మీ క్లాస్ పర్ఫామెన్స్ ఏంటి..? వారి పెర్ఫార్మెన్స్ ని ఎవల్యూయేట్ చేయాలి? అంటూ ఒక్కొక్కరిని అడుగుతూ.. వారు చేసిన తప్పుల గురించి చెబుతూ వారిపై మండిపడ్డారు.
పృథ్వీ కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..
ముందుగా యష్మీ తో మొదలుపెట్టగా.. తన ఉద్దేశంలో అభయ్ అన్ని టాస్కులు చాలా బాగా ఆడాడు అంటూ చెప్పుకొచ్చింది యష్మి. దాంతో విష్ణు ప్రియ ఉద్దేశంలో ఏం జరిగింది అంటూ ప్రశ్నించగా.. విష్ణు ప్రియ మాట్లాడుతూ.. అన్న నన్ను తోసేశారు అంటూ తనకు జరిగిన నష్టం గురించి వివరించింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని వీడియో క్లిప్ ద్వారా చూపించారు నాగార్జున. ఆ తర్వాత పృథ్వి గురించి చెబుతూ ఆడిన ప్రతి టాస్క్ 100% ఇచ్చారంటూ చెప్పుకొచ్చింది యష్మి. మరి వాక్స్ టాస్క్ లో గివ్ అప్ ఎందుకు ఇచ్చారు అంటూ ప్రశ్నించారు నాగార్జున. తర్వాత పృథ్వి కి వార్నింగ్ ఇస్తూ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పారు నాగార్జున.
చీఫ్ గా యష్మీ ఫెయిల్.. కడిగిపారేసిన నాగార్జున..
ప్రేరణ సంచాలక్ గా ఫెయిల్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చింది యష్మీ. కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది అని చెప్పడంతో.. నాగార్జున కలగజేసుకొని తను కన్ఫ్యూజ్ అయ్యిందా లేక మీరంతా ఆమెను కన్ఫ్యూజ్ చేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హోస్ట్. ఆ తర్వాత సంచాలక్ గురించి మాట్లాడుతున్నావ్ కాబట్టి.. మణికంఠ, సీత టాస్క్ ఆడినప్పుడు నువ్వు సంచాలక్ గా వున్నావ్ కదా అప్పుడు నువ్వు చేసింది ఏంటి అంటూ ప్రశ్నించాడు నాగార్జున.. 250 గ్రామ్స్ డెసిషన్ లో నీ నిర్ణయం కరెక్టా అంటూ ప్రశ్నించాడు. నేను క్లియర్ గా అడిగాను అని మణికంఠ చెబుతున్నా .. అడగలేదు అంటూ యష్మి అబద్ధం చెప్పింది. దీంతో వీడియో క్లిప్ చూపించారు నాగార్జున. నిజం బయట పడేసరికి ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయిపోయింది. ఐదు మంది ఆకలితో ఉంటారు, అందుకే టీం గెలవాలనుకుని అలా చేశాను అంటూ ఏడ్చుకుంటూ చెప్పేసింది. ఇదే విషయాన్ని ఇందాకే ఒప్పుకోవచ్చు కదా అంటూ అడిగారు నాగార్జున. ఇక యష్మి ఫోటోని గన్నుతో పేల్చేసి చీఫ్ గా ఫెయిల్ అయ్యావ్ అంటూ చెప్పేశాడు. ఇక నెక్స్ట్ చీఫ్ గురించి ఏం చెప్పారో తెలియాలి అంటే ఎపిసోడ్ చూడాల్సిందే.