Bigg Boss 8 Day 12 Promo : బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ అప్పుడే 12వ రోజుకు చేరుకుంది. 12వ ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమో ని మేకర్స్ విడుదల చేయగా.. ఇందులో ఇంకో టాస్క్ తో అటు ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాదు ఇటు కంటెస్టెంట్స్ కి కూడా మంచి వినోదాన్ని పంచారు బిగ్ బాస్. ఇకపోతే తాజాగా ఈ ప్రోమోలో సరికొత్త టాస్క్ తో కంటెస్టెంట్ చేసిన సందడి అంతా ఇంతా కాదు అని చెప్పవచ్చు. ఒక్కొక్కరి టాలెంట్ అలా బయటకు వచ్చేసింది.
ట్రూత్ ఆర్ డేర్ అంటే కొత్త టాస్క్..
స్పిన్ ద బాటిల్ అంటూ ట్రూత్ ఆర్ డేర్ అనే ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. మీరందరూ సర్కిల్ గా కూర్చుని మీ అందరి మధ్యలో ఉన్న బాటిల్ ను తిప్పాల్సి ఉంటుంది. ఆ బాటిల్ ఎవరి వైపు అయితే సూచిస్తుందో, ఆ సభ్యుడు ట్రూత్ ఆర్ డేర్ లో ఆ సభ్యుడు ఎంపిక చేసుకున్న చాలెంజ్ ను వేరే సభ్యుడికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటూ శేఖర్ బాషా అక్కడున్న పుస్తకాన్ని చదివి టాస్క్ ను ఇంటి సభ్యులకు వినిపించారు. తర్వాత బాటిల్ తిప్పుతూ ఒక్కొక్కరు ఒక్కో చాలెంజ్ ను ఇంకొకరికి ఇస్తూ తెగ సరదాగా ఎంజాయ్ చేశారు.
శేఖర్ బాషాను బలవంతంగా పూల్లో పడేసిన నైనిక..
అందులో భాగంగానే హీరో ఆదిత్య ఓం లిప్స్ కి విష్ణు ప్రియ లిప్ స్టిక్ వేసింది. ఆదిత్య అమ్మాయిలాగా నడుచుకుంటూ వచ్చి ర్యాంప్ వాక్ చేశాడు. ఆ తర్వాత నైనికాకి ఒక అబ్బాయిని బలవంతంగా లాక్కెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో పడేయాలి అని శేఖర్ భాషా చెప్పగా.. నైనిక శేఖర్ భాషను బలవంతంగా లాక్కెళ్ళి అతడిని స్విమ్మింగ్ పూల్ లో పడేసి అతడితో పాటు ఆమె కూడా అందులో పడిపోయింది.
నిఖిల్.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా..
ఇక తర్వాత చాలెంజ్ లో భాగంగా నిఖిల్ కి చీర కట్టించి అతడిలోని ఇంకో యాంగిల్ ను వెలికి తీశారు కంటెస్టెంట్స్. నిఖిల్ అచ్చం అమ్మాయిలా డాన్స్ చేస్తూ హొయలు పోతూ ఇంటి సభ్యులకు మంచి వినోదాన్ని పంచాడు. నాది నక్కిలీసు గొలుసు అనే పాటకు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అమ్మాయిలా తెగ మెప్పించేశారు నిఖిల్. మొత్తానికైతే నిఖిల్ పర్ఫామెన్స్ కి అందరూ ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. ఈ ప్రోమో చూసిన చాలా మంది నెటిజన్స్ నిఖిల్ లో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.
రెండవ వారం ఎలిమినేషన్..
ఇక మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ లో మొదటి వారంలో భాగంగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 13 మంది హౌస్ మేట్స్ కొనసాగుతున్నారు. ఇప్పటికే 6 మంది నామినేట్ అవ్వగా అందులో కిర్రాక్ సీత , పృథ్వి శెట్టి ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నట్లు సమాచారం. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.