Bigg Boss 8 Day 12 Promo 3: సాధారణంగా ప్రతి సీజన్ లో కూడా చివరి వారాలలో కంటెస్టెంట్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ వారి ఫ్యామిలీ నుంచి వచ్చే బహుమతులు, ఉత్తరాలు పంపించడం సహజమే. అయితే ఎప్పుడో రావాల్సిన బహుమతులను ఈ సీజన్ లో రెండవ వారంలోనే తీసుకొచ్చారు బిగ్ బాస్. మొత్తం 13 మంది కంటెస్టెంట్లలో కేవలం ఐదుగురికి మాత్రమే వచ్చిన బహుమతులను తీసుకునే అవకాశం అందించారు. దీంతో ఒక్కొక్కరు ఎమోషనల్ అవుతూ అందరిని ఏడిపించేశారు.
నాన్నకు ప్రేమతో అంటూ ప్రోమో వైరల్..
తాజాగా నాన్నకు ప్రేమతో అంటూ కొద్దిసేపటి క్రితం రెండు ప్రోమో లను విడుదల చేశారు బిగ్ బాస్ . అందులో మొదటి ప్రోమోలో ఐదుగురు సభ్యులకు వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన బహుమతులు పొందే అవకాశం ఉంది అంటూ నిఖిల్(Nikhil ), ఆదిత్య ఓం (Aditya Om), నైనిక (Nainika), సీత (Sita), అభయ్(Abhay )లను గార్డెన్ ఏరియాలోకి పిలిచి, వారి ఇంటి నుంచి వచ్చిన బహుమతులను డిస్ప్లే చేశాడు బిగ్ బాస్. కానీ ఆ బహుమతులు అందుకునే ఆ ఐదుగురు ఎవరో డిసైడ్ చేసే పని మిగిలిన ఇంటి సభ్యుల బాధ్యత అంటూ ఫిట్టింగ్ పెట్టాడు. ముందుగా నిఖిల్ తన తండ్రి షర్టు చూస్తూ ఎమోషనల్ అయిపోయాడు. అబ్బాయిలకు నాన్నను హగ్ చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అందుకే ఆయనకు తెలియకుండా ఆయన షర్టు దొంగతనం చేశా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నిఖిల్.
ఏడిపించేసిన అభయ్..
ఆ తర్వాత అభయ్ వాళ్ళ నాన్నకు ఇచ్చిన గిఫ్ట్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తాను మొదటి సాలరీతో తన తండ్రికి కొని ఇచ్చిన వాచ్ అని, బ్రతుకునంత కాలం తన తండ్రి ఆ వాచ్ పెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు.
అమ్మాయిల కోసం బహుమతులను త్యాగం చేసిన హీరోస్..
ఆ తర్వాత సీత వంతు.. ఐదేళ్ల ప్రేమలో ఉన్న అబ్బాయి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ దొరికాడని , ఐ మిస్ యు కుమార్ అంటూ ఆమె ఏడ్చేసింది. అలాగే ఒక ఫ్రెండ్ ఇచ్చిన బొమ్మను చూస్తూ ఆమె బాధపడింది. ఇక తర్వాత సీత కోసం అభయ్ , నైనికా కోసం నిఖిల్ తమ బహుమతులను కూడా త్యాగం చేశారు.
దుఃఖాన్ని ఆపుకోలేక పోయిన ఆదిత్య ఓం..
ఆ తర్వాత ప్రోమోలో శేఖర్ భాషకు బుజ్జి కుక్కపిల్ల ఫోటో ఒకటి ఫ్రేమ్ పంపించారు. ఇక తర్వాత సోనియా.. వస్తువులకు నేను ఎమోషనల్ కాను, మనుషులకి ఎమోషనల్ అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక తర్వాత ఆదిత్య ఓం తన తండ్రి ఫోటోని చూస్తూ నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో నేనే తెలుసుకొని, వాటిని సరిదిద్దుకున్నాను. అయితే నా బ్యాడ్ క్వాలిటీస్ ని మా నాన్న వల్లే మార్చుకోగలిగాను అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. కొడుకు తండ్రి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందంటే, ఆ బాండింగ్ ను కొడుకు అసలు చెప్పుకోలేడు అంటూ అభయ్ కామెంట్ చేశాడు.
కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎమోషనల్..
ఆ తర్వాత నబీల్ కూడా తన తండ్రితో దిగిన ఫోటోని పంపించారు. నబీల్ తండ్రి కరోనా సమయంలో చనిపోయారని, ఆ విషయాన్ని నబీల్ చెప్పుకొచ్చారు. ఇక ఆగస్టు 15 న పృథ్వీ వాళ్ళ తండ్రి కూడా చనిపోయారని, ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ తండ్రుల గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతూ అందరిని కంటతడి పెట్టించేశారు. మొత్తానికైతే నాన్నకు ప్రేమతో అంటూ వచ్చిన ఈ ప్రోమో లు ఆడియన్స్ ను కూడా కంటతడి పెట్టించాయి.