Bigg Boss8 Day11 Promo: బిగ్ బాస్ సీజన్ 8 అలా మొదలైందో లేదో అప్పుడే పదకొండవ రోజు మొదలైంది. ఇక 11వ రోజు ఎపిసోడ్ లో భాగంగా తాజాగా ఒక ప్రోమో ను విడుదల చేశారు. ఆ ప్రోమో చూస్తుంటే డబ్బు పేరిట ఆశ చూపించి, కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది. మరి ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
డబ్బు ఆశ చూపించి కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్..
బిగ్ బాస్ మీకు ఈ సీజన్లో మునుపేన్నడూ చూడని విధంగా ఇన్ఫినిటీ మనీని ప్రైజ్ మనీలా సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికి మీరు చేయాల్సిందల్లా సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే మొదటి అవకాశం కోసం సిద్ధంగా ఉండండి అంటూ ప్రోమో మొదలైంది. ఇక అక్కడ టీవీలో స్విమ్మింగ్ పూల్ లోకి జంప్ చేయాలి అంటూ మణికంఠ, సోనియా ఆకుల , విష్ణు ప్రియ పేర్లను డిస్ప్లే చేశారు బిగ్ బాస్. హౌస్ నుండి బయట స్విమ్మింగ్ పూల్ లోకి జంప్ చేయడానికి, వీరు ముగ్గురు పరిగెత్తే సమయంలో అనుకోకుండా సోనియా బొక్క బోర్ల పడింది. ఇక మణికంఠను మిగతా కంటెస్టెంట్స్ ఆపే ప్రయత్నం చేయగా, విష్ణు ప్రియ మాత్రం సమయానుసారం పాటించి, తొందరగా పరిగెత్తి పూల్ లో దూకేసింది. ఇక సడన్ గా సోనియా పరిగెత్తడంతో అందరూ ఆమెను లేపే ప్రయత్నం చేశారు.
గొడవపడ్డ నిఖిల్ – యష్మీ..
ఆ తర్వాత పృథ్వీ సోనియాను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ఈ టాస్క్ పూర్తయిన వెంటనే నిఖిల్, యష్మి మధ్య గొడవ మొదలైంది. నిఖిల్ మాట్లాడుతూ.. మణికంఠ ప్లేస్ లో నేను ఉంటే నేను రఫ్ గా ఆడతాను కదా.. నీకు తగలొచ్చు నాకు దెబ్బలు తగలవచ్చు. మనం ఆర్టిస్టులము. తల పగిలితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ కాస్త నోరు చేసి మాట్లాడారు నిఖిల్. వెంటనే యష్మీ ఫైర్ అవుతూ.. సెంటిమెంటల్ గా మాట్లాడి.. మా గేమ్ ని పక్కన పెట్టి, మా బుర్రలను నీ వైపు కన్వర్ట్ చేసుకుంటున్నాం అంటూ ఫైర్ అయ్యింది. వెంటనే శేఖర్ బాషా, నిఖిల్ ను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
నిఖిల్ – నవీన్ మధ్య చిన్నపాటి యుద్ధం..
ఇక తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి రెండవ టాస్క్ ఇచ్చారు. ఇక రెండవ అవకాశం విలువ రూ.50,000. ప్లాస్మాలో పేర్లు చూపించిన సభ్యులు తాడును వదలకుండా పట్టుకుని, తమకు చెందిన బాస్కెట్ లో తమకు చెందిన బాల్స్ ను వేయాల్సి ఉంటుంది అంటూ చెప్పాడు. ఇక అక్కడ పృథ్వీ, నవీన్, నిఖిల్ పేర్లను చూపించారు బిగ్ బాస్. గేమ్ మొదలవగానే ముగ్గురు పోటా పోటీగా పోటీపడ్డారు. కానీ ఈ పోటీలో నబీల్ తప్పుకున్నారు. నిఖిల్ , పృథ్వీ మధ్య బీకర యుద్ధం జరిగింది. మొత్తానికి అయితే డబ్బు ఆశ చూపించి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్ అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.