Bigg Boss 8 Telugu Promo : తెలుగు రియాలిటీ బిగ్ బాస్ ప్రస్తుతం మూడో వారంలోకి అడుగుపెట్టింది. సండే ఫండే ఎపిసోడ్ లో శేఖర్ బాషా ( Sekhar Bhasha ) ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అతన్ని కావాలనే నామినేట్ చేశారని ఆయన ఫ్యాన్స్ కూడా ఆరోపిస్తున్నారు. ఇక మూడో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. మరి మూడో వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉండబోతున్నారో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ వారం నామినేషన్ లో ఉన్నది వీరే అంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అలాగే బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో ను బిగ్ బాస్ విడుదల చేశారు. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం నామినేషన్ లో ఉన్నది ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
మూడో వారానికి గాను 12 హౌస్ మెట్స్ ను శక్తి, కాంతారా అని విభజించిన సంగతి తెలిసిందే.. శక్తి క్లాన్కు నిఖిల్ ( Nikhil ), కాంతారా క్లాన్కు అభయ్ ( Abhay )లు చీఫ్లుగా ఉంటారని చెప్పారు నాగ్. ఏ క్లాన్లోకి వెళ్లాలన్నది కంటెస్టెంట్స్‌కే వదిలేశాడు కింగ్. దీంతో నిఖిల్ టీమ్‌లోకి విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా, శేఖర్ భాషా, సీత, నైనికలు వచ్చారు. అభయ్ టీమ్‌లోకి ప్రేరణ, యష్మీ గౌడ, ఆదిత్య ఓం, నబీల్, నాగమణికంఠలు వెళ్లారు.. ఇక వీరందరిలో చివరగా ఆదిత్య ఓం, శేఖర్ భాషా మిగిలారు.. ఇద్దరి మధ్య ఒక టాస్క్ పెట్టి శేఖర్ బాషాను ఎలిమినేట్ చేసి పంపించారు. మూడో వారం ఖచ్చితంగా లేడీ వెళ్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
కంటెస్టెంట్స్ తాము నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిపై చెత్తను కుమ్మరించి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా నువ్వు గెలవాలన్న స్పిరిట్ నాకిష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తావ్ అన్నది తనకు నచ్చలేదని సీత .. పృథ్వీని ఉద్దేశించి అంటుంది. నేనొక టీమ్‌లో ఆడినప్పుడు .. అపోజిట్ టీమ్‌ని ఎలాగైనా ఓడించాలనే ఆడతానని పృత్వీ తేల్చిచెబుతాడు.యష్మీని నామినేట్ చేసిన మణికంఠ తన రీజన్స్ చెప్పాడు. ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు కడగటం లేదు.. అయితే టీమ్‌కి పవర్ వచ్చినప్పుడు మాకు ఆ అవసరం లేదని యష్మీ చెబుతుంది. ఆ మాటతో చిరాకు పడిన మణికంఠ.. నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ ఫైర్ అవుతాడు. నువ్వు నా దగ్గరికొచ్చి డ్రామాలు చేస్తావ్ అంటూ యష్మీ డైలాగ్ వదులుతుంది. నాకు పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే రైజ్ చేస్తానని మణికంఠ చెప్పగా.. నువ్వేంటీ బొక్క రైజ్ అంటూ యష్మీ బూతులు మాట్లాడటం చూడొచ్చు..
ఇక ఆ తర్వాత మణికంఠ ( Manikanta ) పై రివెంజ్ తీర్చుకునేలా రివర్స్‌లో నామినేట్ చేసింది.. ఈ హౌస్‌లో ఉన్నన్ని రోజులు నిన్ను నామినేషన్స్‌లో తీసుకుంటానని తేల్చి చెబుతుంది యష్మీ. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను చూస్తే.. ప్రేరణ ను నబీల్ నామినేట్ చేస్తాడు.. దానికి కారణాలు చూస్తూ ఇద్దరు కాసేపు గొడవ పడతారు.. ఆ గొడవ కాస్త వాదనగా మారుతుంది. ఇక మణికంఠ అసలు స్వరూపం చూసి ఆదిత్య షాక్ అవుతాడు. మొత్తానికి ఈ ప్రోమో కాస్త రచ్చ రచ్చగా ఉంది.. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..