Ariyana Glory.. బిగ్ బాస్ బ్యూటీ గా పేరు సొంతం చేసుకున్న అరియాణా గ్లోరీ (Ariyana glory) బిగ్ బాస్ కి రాకముందు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తో ఒక ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూ తో భారీగా పేరు సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి బోల్డ్ బ్యూటీగా పేరు దక్కించుకుంది. ఇకపోతే హౌస్ లో తన ఆట తీరు తో, అందంతో ఆడియన్స్ కి మరింత దగ్గర అయింది. నిజానికి బిగ్ బాస్ షో కి వెళ్లి వచ్చినవారు ఎంతోమంది ఆ తర్వాత మీడియాలో కనిపించలేదు. సినిమా ఆఫర్స్ కూడా అంతగా లభించలేదు. అయితే కొంతమంది మాత్రం నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అవకాశాలు అందుకుంటున్నారు.
వర్మ ఇంటర్వ్యూ తో భారీ పాపులారిటీ..
అలాంటి వారిలో అరియానా కూడా ఒకరు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరొకసారి అరియానా ఆర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మళ్లీ పాపులర్ అయిపోయింది. అదే సమయంలో ఆర్జీవితో వర్కౌట్స్ చేస్తూ.. కలసి ఇంటర్వ్యూ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత పలు టీవీ షోలలో కూడా సందడి చేసిన ఈమె, సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన అందచందాలతో అభిమానులకు కునుకు లేకుండా చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
గ్లామర్ వలకబోస్తూ డాన్స్ తో రచ్చ..
ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి గ్లామర్ తో రచ్చ లేపింది. ఒక రేంజ్ లో వయ్యారాలు వలకబోస్తూ వీడియో చేసింది. తన స్నేహితుడు రోల్ రైడ్ లేటెస్ట్ ఆల్బమ్ కాకినాడ కాజా అనే పాటకు స్టెప్పు లేసింది. ఒక రేంజ్ లో అందాలు ఆరబోస్తూ మాస్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ వీడియోలో అరియానా మరింత అందంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అరియానా బ్లాక్ అవుట్ ఫిట్ లో అందచందాలతో నడుము వయ్యారాలతో మెలికలు తిరుగుతూ యువతకు చుక్కలు చూపిస్తోంది. ఏదేమైనా అరియానా అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అరియానా సినిమాలు..
ఈమె కెరియర్ విషయానికి వస్తే. వెండితెరపై బుల్లితెరపై ఏ చిన్న అవకాశం వచ్చినా సరే మాట్లాడి.. తన అందాల రుచి చూపించడానికి రెడీ అన్నట్లుగా హింట్ ఇస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాను వేదిక చేసుకుని రచ్చ చేస్తున్న ఈమె ఇటీవలే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి వెండితెరపై మెరిసింది. మొత్తానికైతే అటు వెండితెర ఇటు బుల్లితెర అంటూ అవకాశాలు అందుకుంటూ మరింత క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈమెకు ఎలాంటి అవకాశాలు తలుపుతడతాయో చూడాలి.
View this post on Instagram