Bigg Boss 8 Telugu : తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 8 సీజన్ కు ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తుంది. మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అయ్యింది. రెండో వారం కూడా నామినేషన్ల ప్రక్రియ రెండు రోజుల పాటు సాగింది. ప్రతి వారం రెండు రోజులు నామినేషన్ ఉంటుంది. ఈ వారం నామినేషన్ కోసం మొదటి రోజు ఉత్కంటగా సాగింది. కానీ ఇప్పుడు మాత్రం తేలిపోయింది. ఈ సీజన్ టాస్క్ ల కన్నా గొడవలకి కేరాఫ్ గా నిలిచిందని వార్తలను అందుకుంది. అయితే ఈ సీజన్ కంటెస్టెంట్ మణికంఠ మాత్రం మొదటి రెండు ఎపిసోడ్స్ తోనే జనాల్లో క్రేజ్ ను అందుకున్నాడు. అందులో తాను విగ్ తీసే సీన్ పై సోషల్ మీడియాలో మీమ్స్ పెరుగుతున్నాయి. తాజాగా ఓ షోలో యాంకర్ అతని పరువును తీసేసింది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ మణికంఠ ( Manikanta) గత వారం జరిగిన నామినేషన్స్‌లో అంతా తనను సింపథీ ట్రాక్ ప్లే చేస్తున్నావాని, ఎవరితో కలవడం లేదని అనడంతో బరస్ట్ అయ్యాడు. తన జీవితంలో జరిగిన బాధాకర విషయాలన్నింటిని నామినేషన్స్‌లో చెబుతూ ఏడ్చాడు. ఆ ఎపిసోడ్ ఎంతగా హైలెట్ అయ్యిందో చూశాం.. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడని, స్టెప్ ఫాదర్ వల్ల అనుమానాలు ఎదుర్కున్నాని, తర్వాత క్యాన్సర్‌తో తల్లి కూడా చనిపోయిందని, కట్టే కట్టే పేర్చి తల్లి శవాన్ని కాల్చాల్సి వచ్చిందని, భార్య విడాకులు ఇచ్చిందని, కూతురుకు దూరమైపోయాయని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అదే కంటిన్యూ చేశాడు. హౌస్ మెట్స్ తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తన విగ్ ను పక్కన పడేసాడు. అది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
మణికంఠ పరువును తీసేసిన శ్రీముఖి, దీపికా..
ఆదివారం విత్ స్టార్ మా పరివారం 100వ ఎపిసోడ్ స్పెషల్ ఈవెంట్ ప్రోమోను విడుదల చేశారు. ఈ షోలో బిగ్ బాస్ తెలుగు 7 రన్నరప్ అమర్ దీప్ (Amardeep) భార్య తేజస్విని గౌడ (Tejeswini Gowda), అర్జున్ అంబటితోపాటు బ్రహ్మముడి టీమ్ కూడా పాల్గొంది. హలో నాగార్జున గారు అని దీపికా ( Deepika) అంటుంటే.. ఆయన నెంబర్ కూడా నీ దగ్గర ఉందా అని శ్రీముఖి (Srimukhi) అడిగింది. హా ఉంది దీపికా చెప్పడంతో అంతా నవ్వేశారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఈ అమ్మాయికి బదులు నేను ఉండి ఉంటే కంటెంట్ బాగా ఇచ్చేదాన్ని అని ఎవరిని అనుకుంటున్నావ్ అని శ్రీముఖి అడిగింది.. ఆ క్రమంలో మాట్లాడుతూ.. నిఖిల్ ఇలా ట్రాన్సరెంట్ గా ఉండలేని అని విగ్గు పీకేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మణికంఠ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కొంచెం కూడా సిగ్గు లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో పై మీరు ఒక లుక్ వేసుకోండి..